పిలిచాడు.. వెనక్కు తిరిగింది.. అంతే..!

తన మాజీ ప్రేయసితో మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక్క సారిగా ఆమెను కాల్చి పడేశాడు. బెదిరిస్తున్నాడేమోనని ఆమె అనుకుంది.. కానీ కాల్చేస్తాడని అసలు అనుకోలేదు. ఈ ఘటన థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో చోటుచేసుకుంది. 21 ఏళ్ల నచరీయ థప్రాజిత్ అనే అమ్మాయిని ఆమె మాజీ ప్రియుడు 24 ఏళ్ల పుకాపోంగ్ చిత్తరోమ్ తన హ్యాండ్ గన్ తో కాల్చి చంపేశాడు. ఆ తర్వాత అతడు కూడా తన నోట్లో గన్ను పెట్టుకొని కాల్చేసుకున్నాడు. అది కాస్తా అతడి బుగ్గల్లో నుండి బయటకు వెళ్ళిపోయింది.

వీరిద్దరూ ఒకరికొకరు గత అయిదేళ్ళుగా తెలుసు.. ప్రేమించుకున్న తర్వాత వీరిద్దరూ విడిపోయారు. ఇటీవల అతడు మరోసారి ఆమె వెంటపడడం మొదలుపెట్టాడు. అయినప్పటికీ ఆమె అతన్ని పట్టించుకోలేదు. దీంతో అతడు ఆమె ఫ్లాట్ దగ్గర ఎదురుచూశాడు. ఆమె ఉదయం 11:30 గంటల సమయంలో తన క్లాస్ మేట్ తో కలిసి నడుచుకుంటూ వస్తోంది. అతడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నా కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళబోయింది. ఇంతలో అతడు హ్యాండ్ గన్ బయటకు తీశాడు. ఆ తర్వాత ఆమె వెనక్కు తిరగడంతో ఆమె ఎద భాగంలో కాల్చాడు. వెంటనే ఆమె కుప్పకూలిపోయింది. ఆ తర్వాత ఆమె శవాన్ని కౌగిలించుకున్న అతడు.. తన నోట్లో కాల్చుకున్నాడు. అది కాస్తా అతడి బుగ్గల్లో గాయాన్ని చేసింది. అతన్ని ప్రస్తుతం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు జరిగిన విషయాన్ని అమ్మాయి కుటుంబసభ్యులకు తెలియజేశారు. ఈ మొత్తం ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here