నవాజ్ షరీఫ్ గారికో బూటుదెబ్బ..!

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు అవమానం ఎదురైంది. ఆయన ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి బూటుతో షరీఫ్ మీద దాడి చేయడంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఈ ఘటన లాహోర్ లో చోటుచేసుకుంది. ఆ బూటు దెబ్బ షరీఫ్ చెవికి, భుజానికి పడింది. రాజ్యాంగ నిబంధనల పేరుతో మహ్మద్ ప్రవక్త బోధించిన విషయాలను మార్చడానికి ప్రయత్నిస్తున్నందుకే షరీఫ్ పై బూటును విసిరానని ఆ వ్యక్తి తెలిపాడు.

లాహోర్‌ లోను బహిరంగసభకు హాజరైన షరీఫ్ పైకి బూటు విసిరాడు. బూటు నవాజ్ షరీఫ్ భుజానికి తగిలింది. ‘జామియా నయామియా సెమినరీ’ మాజీ విద్యార్థిగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. సభకు హాజరైన నిందితుడు ముందు వరుసకు చేరుకొని షరీఫ్ పై బూటు విసిరాడు. నిందితుడితో పాటు అతనికి సహకరించిన వ్యక్తిని పోలీసులు అక్కడికక్కడే పట్టుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here