శ్రియా భూపాల్ నిశ్చితార్థం చేసుకుంది ఎవరినంటే..!

రెండు రోజుల క్రితం శ్రియ భూపాల్ ఎంగేజ్ మెంట్ పూర్తీ అయిపోయింది. గతంలో శ్రియా భూపాల్ అక్కినేని అఖిల్ తో నిశ్చితార్థం చేసుకొని.. ఆ తర్వాత పెళ్ళి ఫిక్స్ అయిన సమయంలో ఎందుకో పెళ్ళి వద్దు అని అనుకున్నారు. అప్పట్లో ఎన్నో వార్తలు.. రోజుకో కథనాలు వినిపించాయి. అయితే ఇప్పుడు శ్రియా భూపాల్ రామ్ చరణ్ భార్య ఉపాసన బంధువు అనిందిత్ రెడ్డితో ఎంగేజ్మెంట్ పూర్తీ చేసుకుంది. రెండు రోజులుగా ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి.


ఈ అనిందిత్ రెడ్డి ఎవరో కాదు.. అపోలో సంస్థల అధినేత ప్రతాప్ సి.రెడ్డి మనవడు, చేవేళ్ల సిట్టింగ్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పెద్ద కుమారుడు. అనిందిత్ తల్లి సంగీత, ఉపాసన తల్లి శోభన సొంత అక్కాచెల్లెళ్లు. అనిందిత్ దేశీయ మోటార్ స్పోర్ట్స్ సర్కిల్ లో ప‌ని చేస్తున్నాడు. ఈ వేడుక‌కు రామ్‌చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌ల‌తో పాటు కుటుంబ స‌భ్యులు హాజ‌ర‌య్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here