32 వేల అడుగుల ఎత్తులో ప‌గిలిన విమానం కాక్‌పిట్ అద్దం..ప్ర‌యాణికుల ప‌రిస్థితి?

చైనాకు చెందిన సిచువాన్ ఎయిర్‌లైన్స్ విమానం అది. 120 మంది ప్ర‌యాణికుల‌తో సిచువాన్‌లోని షువంగ్లియు అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం నుంచి లాసాకు బ‌య‌లుదేరి వెళ్లింది. టేకాఫ్ తీసుకున్న కొన్ని నిమిషాల్లోనే ఆ విమానం సుమారు 32 వేల అడుగుల ఎత్తుకు వెళ్లింది.

లాసా వైపు శ‌ర‌వేగంగా వెళ్తుండ‌గా స‌మ‌యంలో.. హ‌ఠాత్తుగా ఆ విమానం కాక్‌పిట్ విండ్ షీల్డ్ పెద్ద శ‌బ్దం చేస్తూ ప‌గిలిపోయింది. దాని ముక్క‌లు కాక్‌పిట్‌లోకి ఎగిరొచ్చి ప‌డ్డాయి. అద్దం ప‌గిలిపోవ‌డంతో.. గాలి విమానంలోనికి దూసుకొచ్చింది. గాలి వేగానికి ఒక్క‌సారిగా ఊగిపోయిందా విమానం. ఊహించ‌ని ఈ ఘ‌ట‌న‌తో పైలెట్లు, విమాన సిబ్బంది, ప్ర‌యాణికులు కంగారుప‌డ్డారు.

వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన పైలెట్ షువంగ్లియు విమానాశ్ర‌యం సిబ్బందికి స‌మాచారాన్ని చేర‌వేశాడు. వారి అనుమ‌తితో విమానాన్ని చెంగ్డు ప్రాంతంలో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. అద్దం ప‌గ‌ల‌డంతో కో పైలెట్ స‌హా ఓ ప్ర‌యాణికుడు గాయ‌ప‌డ్డారు. చెంగ్డులో విమానాన్ని ల్యాండింగ్ చేసిన వెంట‌నే వారిద్ద‌ర్నీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కాక్‌పిట్ విండ్‌షీల్డ్ ప‌గిలిన‌ట్టు సిచువాన్ ఎయిర్‌లైన్స్ యాజ‌మాన్యం ధృవీక‌రించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here