కలెక్టర్ తల మీద చేయి వేసిన సిద్ధరామయ్య..!

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు ఓ జిల్లా కలెక్టర్ తో ప్రవర్తించిన తీరు అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈరోజు కర్ణాటక రాష్ట్రం.. చిక్ బళాపుర జిల్లాలోని నంది గ్రామంలో ఉన్న మెగా డైరీని ఓపెన్ చేయడానికి వచ్చారు. ఆ సమయంలోనే కర్ణాటకలో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నట్లు ఎలెక్షన్ కమీషన్ స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్ వెంటనే అమలు లోకి వస్తుందని తెలిపారు. ఆ సమయంలో సిద్ధరామయ్య నంది గ్రామలో ఉన్నారు. అక్కడే ఉన్న కలెక్టర్ దీప్తి ఆదిత్య కానడే సిద్ధరామయ్యతో సార్ ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉంది అని చెప్పింది. వెంటనే ఆయన ఆమె తల మీద చేయి వేసి నాకు తెలుసులేమ్మా అని చెప్పారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కలెక్టర్ దీప్తి ఆదిత్య కానడేను ఆయన చనువుతో అలా అనేసారు. వెంటనే ఆయన స్పందిస్తూ నాకు తెలుసులేమ్మా.. నేను భోజనం చేసేసి వెళ్ళిపోతాను అని చెప్పాడురు. ఆ తర్వాత ప్రభుత్వ కాన్వాయ్ ను కూడా ఉపయోగించకుండా సొంత వాహనంలో వెళ్ళిపోయారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మే 12వ తేదీన ఎన్నికలను నిర్వహిస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. మే15న ఫలితాలు వెలువడుతాయని వెల్లడించింది. ఏప్రిల్ 25న నామినేషన్ వేయచ్చు.. 27న అభ్యర్థులు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. మొత్తం 224 నియోజకవర్గాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుపుతున్నట్టు పేర్కొంది. ఎన్నికల్లో ఈవీఎంలతో పాటు వీవీపాట్ మెషీన్లను కూడా వినియోగించనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here