ప‌దిరోజులుగా ఇల్లు దాట‌ని ఒంట‌రి మ‌హిళ‌! ఆ వీధిలో అడుగు పెడితే ఆ ఇంట్లో నుంచి దుర్వాస‌న‌!

ఓ మ‌హిళ ఒంట‌రిగా నివ‌సించే ఇల్లు అది. అయిదారేళ్లుగా ఆమె అదే ఇంట్లో నివ‌సిస్తున్నారు ఒంట‌రిగానే. స్థానికుల‌తో పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు. బ‌య‌ట కూడా పెద్ద‌గా క‌నిపించే వారు కాదు. ప‌దిరోజులుగా ఆ మ‌హిళ అస్స‌లు గ‌డ‌ప దాటి బ‌య‌టికి రాలేదు. ఇంటి గేటు ద‌గ్గ‌ర‌గా వేసి ఉండ‌టంతో ఆ వీధిలో వారు అంత‌గా దృష్టి పెట్ట‌లేదు.

రోజులు గ‌డిచే కొద్దీ ఆ ఒంటరి మ‌హిళ నివ‌సిస్తోన్న ఇంటి నుంచి దుర్వాస‌న‌.. ఘాటుగా వెలువ‌డింది. మొద‌ట్లో ఎక్క‌డి నుంచి వ‌స్తున్న‌దనే విష‌యాన్ని ప‌ట్టించుకోలేదు. ఆ దుర్వాస‌న తీవ్ర‌త మ‌రింత పెర‌గ‌డంతో అదెక్క‌డి నుంచి వ‌స్తోంద‌నే విష‌యం ఆరా తీశారు. ఆ ఒంట‌రి మ‌హిళ నివ‌సిస్తోన్న ఇంట్లో నుంచే వ‌స్తోంద‌ని గుర్తించారు.

లోనికి వెళ్లి చూసిన ఆ వీధిలో వారికి గుండెలు గుభేల్ మ‌న్నాయి. అతి దారుణంగా హ‌త్య‌కు గురైన క‌నిపించారామె. చేతులు వెన‌క్కి విరిచి క‌ట్టేసి, కుళ్లిపోయిన స్థితిలో ఆమె మృత‌దేహం స్థానికుల కంట‌ప‌డింది. వెంట‌నే వారు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. క‌ర్ణాట‌క‌లో జిల్లాకేంద్రం రామ‌న‌గ‌ర‌లోని విజ‌య‌న‌గ‌ర లే అవుట్‌లో చోటు చేసుకున్న ఘ‌ట‌న ఇది.

స‌మాచారం అందుకున్న వెంట‌నే రామ‌న‌గ‌ర టౌన్ పోలీసులు సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్ట‌మ్ కోసం జిల్లా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మృతురాలి పేరు స‌ర‌స్వ‌తి అని స్థానికులు తెలిపారు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆమెను హ‌త్య చేసి ఉంటార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ప‌లు కోణాల్లో ద‌ర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here