చెరువులో ప‌డి అయిదుమంది పిల్ల‌లు మృత్యువాత‌!

కోలార్‌/చిత్ర‌దుర్గ‌: చెరువులో స్నానం చేయ‌డానికి దిగిన అయిదుమంది మృత్యువాత ప‌డిన ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లో వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకుంది. కోలార్ జిల్లాలోని హోళ‌లి గ్రామ శివార్ల‌లోని చెరువులో దిగిన భ‌వ్య‌, శిల్ప అనే అక్క చెల్లెలు జ‌ల స‌మాధి అయ్యారు.

పాఠ‌శాల‌ల‌కు సెల‌వు కావ‌డంతో గురువారం స‌ర‌దాగా చెరువు వ‌ద్ద‌కు వెళ్లిన వారు దుర‌దృష్ట‌వ‌శావ‌త్తు అందులో ప‌డి మ‌ర‌ణించారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని, మృత‌దేహాల‌ను వెలికి తీశారు.

ఈ ఘ‌ట‌న‌పై కోలార్ రూర‌ల్ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. చిత్ర‌దుర్గ జిల్లాలో చోటు చేసుకున్న మ‌రో ఘ‌ట‌న‌లో ముగ్గురు బాల‌లు మ‌ర‌ణించారు. జిల్లాలోని సిరిగెరె గురుపీఠం శాంతివ‌నంలో ఉన్న రోచ‌క్ చెక్‌డ్యామ్‌లో ప‌డి ద‌ర్శ‌న్‌, శివ‌రాజ్‌, ఆకాశ్ మ‌ర‌ణించారు. భ‌ర‌మ‌సాగ‌ర పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here