తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జైలుశిక్ష.. ఎన్ని రోజులో తెలుసా..?

కొందరు బిడ్డలు ఉంటారు.. పెరిగి పెద్దయ్యాక తల్లిదండ్రులను అసలు పట్టించుకోరు. ఇలాంటి వారు రాను రానూ ఎక్కువైపోతున్నారు. అందుకే ఈ దేశంలో వృద్ధాశ్రమాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇకపై తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జైలు శిక్ష తప్పదు. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా ఉండేందుకే కొత్తగా సవరణలు చేశారు.

ప్రస్తుతమున్న మూడు నెలల జైలు శిక్షను ఆరునెలలకు పెంచేయనున్నారు. ఒకవేళ తమ బిడ్డలు పట్టించుకోలేదని ఎవరైనా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. ఆ గొప్ప బిడ్డలు కాస్తా ఆరునెలల పాటూ జైల్లో గడపాల్సిందే. సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రిత్వ శాఖ ఇందుకోసం వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ డ్రాఫ్ట్ బిల్లు 2018 ని సిద్దం చేసింది. గతంలో ఉన్న చట్టానికి ఈ సవరణ చేర్చడంతో 60 ఏళ్లు, అంతకుపైబడిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన వారికి కఠిన శిక్షలు విధిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here