పవన్ కళ్యాణ్ పై చెప్పు విసరాలని భావించారు.. అది కాస్తా వెళ్ళి..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాగిస్తున్న తెలంగాణ యాత్రలో ఆయనపై చెప్పు వేయాలని భావించారు. అయితే అది కాస్తా ఆయ‌న కాన్వాయ్‌పై పడింది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లోని ఖ‌మ్మం జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు జనసేనాని‌. ఖ‌మ్మంలోని త‌ల్లాడ సెంట‌ర్‌కి చేరుకోగానే ఆయ‌న కాన్వాయ్‌పై ఓ గుర్తు తెలియ‌న వ్య‌క్తి దూరం నుంచే చెప్పు విసిరాడు. అది ఆయ‌న కాన్వాయ్‌పై ప‌డింది. ప‌వ‌న్ కాన్వాయ్‌పై చెప్పు దాడి జ‌ర‌గ‌డంతో ఆయ‌న సిబ్బంది షాక్ తిన్నారు. అది చేసిన వ్య‌క్తి కోసం కాసేపు గాలించారు. ప‌వ‌న్ వెంట‌నే వారిని వారించాడు.

తాను ఇలాంటి వాటిని ప‌ట్టించుకోన‌ని అన్నారు. తాను ప్ర‌జ‌ల కోసం పోరాడతాన‌ని వ్యాఖ్యానించారు. తన‌పై దాడులు చేసిన వారిపై ఎలాంటి ఎదురుదాడి చేయ‌న‌ని అన్నారు. త‌న‌కు కులం, మ‌తం లేద‌ని అన్నారు. త‌న‌ది జాతీయ‌తా వాద‌మ‌ని వ్యాఖ్యానించారు. అక్కడి ఏబీ గార్డెన్స్ లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల కార్యకర్తలతో పవన్ సమావేశమయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here