బాల్ ట్యాంప‌రింగ్: ఆ శిక్ష త‌క్కువే! ప‌రిమిత నిషేధంతో స‌రిపెట్టిన క్రికెట్ ఆస్ట్రేలియా

మెల్‌బోర్న్‌: బాల్ ట్యాంప‌రింగ్ ఆరోప‌ణ‌ల్లో ముగ్గ‌ర్ని మాత్ర‌మే దోషులుగా తేల్చిన క్రికెట్ ఆస్ట్రేలియా.. వారిపై చ‌ర్య‌లు తీసుకుంది. ప్ర‌ధాన నిందితుడిగా భావిస్తోన్న డేవిడ్ వార్న‌ర్‌, అత‌నికి స‌హ‌క‌రించిన స్టీవెన్ స్మిత్‌ల‌పై ఏడాది కాలం పాటు నిషేధం విధించింది. కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెల‌ల నిషేధాన్ని విధించింది.

ఈ మేర‌కు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఓ ప్ర‌క‌ట‌న వెల్ల‌డించింది. ద‌క్షిణాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ సంద‌ర్భంగా ఆసీస్ క్రికెట‌ర్లు బాల్ ట్యాంప‌రింగ్‌కు పాల్ప‌డిన‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. తాము ఉద్దేశ‌పూర‌కంగానే బాల్ ట్యాంప‌రింగ్ చేసిన‌ట్టు ఆ జ‌ట్టు కేప్టెన్ స్టీవెన్ స్మిత్‌, వైస్ కేప్టెన్ డేవిడ్ వార్న‌ర్ అంగీక‌రించారు. బాన్‌క్రాఫ్ట్‌ను కూడా దోషిగా తేల్చారు.

ఈ ఘ‌ట‌న‌లో అదే జ‌ట్టుకు చెందిన మ‌రికొంత‌మంది ప్ర‌మేయం ఉండొచ్చ‌ని వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వ‌హించిన విచార‌ణ‌లో ఈ ముగ్గురే దోషుల‌ని తేలింది.

దీనితో- ముగ్గురిపై చ‌ర్య తీసుకుంది. వారి శిక్ష‌ను ఖ‌రారు చేసింది. క్రికెట్‌లో బాల్ ట్యాంప‌రింగ్‌ను అతి పెద్ద నేరంగా ప‌రిగ‌ణిస్తారు. అలాంటి ఉదంతంలో.. అతి త‌క్కువ కాలం శిక్ష‌ను విధించారనే విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి కూడా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here