స్కూల్ పిల్ల‌ల లంచ్‌బాక్స్‌లో పాము

స్కూల్‌కెళ్లే చిన్న‌పిల్ల‌ల లంచ్‌బాక్స్ ఎంతుంటుంది? మ‌హా అంటే ఓ అడుగు. అంత‌కంటే పెద్ద‌వి దాదాపు ఉండ‌క‌పోవ‌చ్చు. అంత చిన్న లంచ్‌బాక్స్‌లోనూ దూరిందో పాము. విష‌పూరిత‌మైన ఈస్ట‌ర్న్‌ బ్రౌన్ స్నేక్ అది.

అన్ని పాముల మ‌ల్లే.. ఇంతింత పొడ‌వు ఉండ‌వవి. అడుగు, రెండ‌డుగుల‌కు మించి ఎద‌గ‌వ‌ట‌. అలాంటి బుల్లి పామొక‌టి లంచ్ బాక్స్‌లో దూరింది. తెల్లార‌గానే.. పిల్ల‌ల‌ను స్కూలుకు పంపించ‌డానికి రెడీ అయిన ఓ గృహిణి ఈ పామును గుర్తించింది.

లంచ్ బాక్స్ మూత అడుగు భాగంలో క‌నిపించింది. వెంట‌నే ఆమె పాముల సంర‌క్ష‌కుల‌ను పిలిపించి, దాన్ని ప‌ట్టిచ్చింది. ఈ ఘ‌ట‌న ఆస్ట్రేలియా అడిలైడ్ శివార్ల‌లోని హాండార్ఫ్‌లో చోటు చేసుకుంది.

ఫోన్ కాల్ అందుకోగానే అడిలైడ్ స్నేక్ క్యాచ‌ర్స్ ప్ర‌తినిధి కోరె యంగ్ ఆమె ఇంటికి చేరుకున్నారు. పామును సుర‌క్షితంగా ప‌ట్టుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here