మహిళ అలా బాత్ రూమ్ లోకి వెళ్ళింది.. ఇలా ఒక మీటర్ పొడవున్న పాము బయటకు..!

స్నానం చేయడానికి బాత్ రూమ్ లోకి వెళ్ళిన మహిళకు అక్కడి లెట్రీన్ సింక్ లో ఏదో కదులుతున్నట్లు కనిపించింది. వెంటనే ఓ తల కనిపించింది. కొంచెం మెల్లమెల్లగా బయటకు రావడం చూసి అది పామే అని ఫిక్స్ అయిన మహిళ గట్టిగా కేకలు వేస్తూ చకచకా బయటకు వచ్చేసింది.

ఈ విషయం అక్కడ ఉన్న వాళ్లకు చెప్పింది. వెంటనే వాళ్ళు పాములు పట్టే వాళ్లకు సమాచారం అందించారు. వాళ్ళు వచ్చి ఆ పామును మెల్లగా బయటకు తీశారు. తీరా చూస్తే అది ఏకంగా 1 మీటరు పొడవు ఉంది. ఆ తర్వాత ఆ పామును తీసుకొని వేరే చోట వదిలేశారు. ఈ వీడియో మే17న సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. చైనాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అది అక్కడకు ఎలా వచ్చిందా అని పోలీసులు ఆరాతీస్తున్నారు.

https://www.facebook.com/shanghaiist/videos/10156943886991030/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here