కోడిగుడ్డు అనుకొని.. రెడ్ టెన్నిస్ బాల్ ను మింగిన పాము..!

కొన్ని కొన్ని సార్లు ఏది పడితే వాటిని మింగి పాములు వాటిని అరిగించుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాయి. అలాంటిదే ఇది కూడా.. కోడి గుడ్డు అనుకుందో ఏమో.. ఏకంగా రెడ్ టెన్నిస్ బాల్ ను మింగేసింది ఓ పాము..! ఇక దాని అవస్థలు ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి. అరిగించుకోలేక.. కక్కలేక ఎన్నో ఇబ్బందులు పడింది. అయితే దీన్ని గమనించిన కొందరు.. దాన్ని తీసుకొని వచ్చి వైద్యులకు అందించారు. అప్పుడు దాన్ని కక్కించారు.

ఒకవేళ టెన్నిస్ బాల్ ను అరిగించాలి అని పాము అనుకుని ఉండి ఉంటే కనీసం 12 నుండి 18 నెలల సమయం పట్టేదట..! అంతలోపు ఈ పాము ఎటువంటి ఆహారం తినలేక చనిపోయేదని చెబుతున్నారు. 1.5మీటర్ల పొడవున్న ఈ కార్పెట్ పైథాన్ పామును బాల్ మింగిన 24 గంటల్లోనే గుర్తించారు. టెన్నిస్ బాల్ పాము కడుపులో అంత ఈజీగా కోడిగుడ్డు లాగా జారదట.. దీంతో దాదాపు 30 నిమిషాల పాటూ వైద్యులు కష్టపడి దాన్ని బయటకు తీశారు. గతంలో తాము ప్లాస్టిక్ ఎగ్స్ నూ.. గోల్ఫ్ బాల్స్ ను పాముల కడుపు నుండి తీశామని.. కానీ ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని చెప్పుకొచ్చారు. ఇకపై పాముకు కూడా బుద్ధి వచ్చిందని తాము అనుకుంటున్నట్లు వెటర్నరీ డాక్టర్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here