ఒక రాత్రికి 20 లక్షలు ఇస్తానని నటి సోఫియాకు పిలుపు.. ఆమె ఏమి చెప్పిందంటే..!

సాధారణంగా హీరోయిన్లు సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల కింద కొందరు చాలా చాలా చెత్త చెత్త కామెంట్లు చేస్తూ ఉంటారు. ఐ వాంట్ యు అని.. నువ్వు నాకు కావాలి అని.. నాతో వస్తావా అని.. ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి అనుభవమే బాలీవుడ్ నటి, మోడల్ అయిన సోఫియా హయత్ కు కూడా ఎదురైంది. ఓ వ్యక్తి నాతో ఒక రాత్రి స్పెండ్ చేయడానికి 20 లక్షలు ఇస్తాను వస్తావా అని అడిగాడు. అందుకు ఆమె ఇచ్చిన రిప్లైకి ఆ వ్యక్తి జన్మలో ఎవరితో కూడా ఇలాంటి కామెంట్ చేయడు.

ఇంతకూ ఏమి జరిగిందంటే.. @abhisheksinghbisht8 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఓ పోస్టు చేస్తూ తనతో ఓ రాత్రి గడిపితే రూ.20 లక్షలు ఇస్తానని సోఫియా హయత్‌కు ఆఫర్ ఇచ్చాడు. ఈ పోస్టుపై సోఫియా స్పందిస్తూ‘‘20 కోట్లు ఇచ్చినా నన్ను కొనలేరు.. నువ్వు ఆఫర్ చేసిన సొమ్ముతో నీ తల్లిని కొనగలవేమో. ఒకసారి మీ అమ్మను అడుగు’’ అంటూ రిప్లై ఇచ్చింది. అంతేకాదు.. అతడి మెసేజ్‌ను స్క్రీన్ షాట్ తీసి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్ అయింది. ఆమె చెప్పిన సమాధానం సోషల్ మీడియాలో ఉన్న ఎంతోమంది చిల్లర గాళ్ళకు సమాధానం అని పలువురు అంటూ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here