ఫీల్డర్ వినిపించుకోవడం లేదని అతడి మీదకు బంతి విసిరిన బౌలర్.. పాకిస్థాన్ క్రికెటర్లు అంతే..!

క్రికెట్ లో బౌలర్.. తాను వేసే బంతి.. బంతికీ.. ఫీల్డర్ ను మార్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఫీల్డర్ ను పిలిచి.. పక్కకు జరుగు.. ఫైన్ లెగ్ లోకి రా.. పవర్ ప్లే సర్కిల్ లోకి రా అంటూ పిలుస్తూ ఉంటారు. ఒక వేళ బౌలర్ చెప్పేది వినిపించకుండా ఉండి ఉంటే.. అంతేకాకుండా అసలు బౌలర్ వైపే చూడకుండా ఉంటే.. పాపం బౌలర్ తన బాధను ఎవరికి చెప్పుకోవాలి. ఇలాంటప్పుడే సహనం నశిస్తూ ఉంటుంది. అలా సహనం నశించినప్పుడు ఏదైనా పొరపాటు చేస్తే అది నవ్వుల పాలు చేస్తుంది. అలాంటి ఘటనే పాకిస్థాన్ సూపర్ లీగ్ లో చోటుచేసుకుంది.

బుధవారం రోజు క్వెట్టా గ్లాడియేటర్స్, లాహోర్ ఖలందర్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఆ సమయంలో లాహోర్ ఖలందర్స్ బౌలర్ సోహైల్ ఖాన్ బౌలింగ్ వేస్తున్నాడు. ఆ సమయంలో లాంగ్ లో యాసిర్ షా ఫీల్డింగ్ చేస్తున్నాడు. అతడిని ఫీల్డింగ్ మారుద్దామని సోహైల్ ఖాన్ భావించాడు. చాలా సార్లు అతన్ని పిలిచాడు కూడానూ.. అయితే యాసిర్ షాకు వినపడలేదు. దీంతో బంతిని తీసుకొని యాసిర్ షా మీదకు విసిరేశాడు. అది కొద్దిలో యాసిర్ షా తలకు తగలకుండా వెళ్ళిపోయింది. దీంతో కోపం తెచ్చుకున్న యాసిర్ షా.. సోహైల్ ను తిట్టడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత బ్రెండన్ మెక్ కాలమ్ సర్ది చెప్పడంతో అంతా సద్దుమణిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కెవిన్ పీటర్సన్ లాంటి క్రికెటర్లు ఈ ఘటనపై సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

https://twitter.com/Aamirviews/status/974010500295151616

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here