చీక‌టి ప‌డితే చాలు! కొండగుహ‌ల్లో నుంచి అంతుచిక్క‌ని ఆర్త‌నాదాలు!

ఛ‌త్తీస్‌గఢ్‌లోని ఓ మారుమూల గ్రామం ఓ వింత అనుభ‌వాన్ని ఎదుర్కొంటోంది. చీక‌టి ప‌డిందంటే చాలు. స‌మీపంలోని కొండగుహ‌ల్లో నుంచి ఆర్త‌నాదాలు వినిపిస్తుంటాయి.

చిక్క‌టి చీక‌టి అలుముకునే స‌మ‌యానికి ఆ ఆర్త‌నాదాలు మ‌రింత తీవ్రంగా ఉంటాయ‌ని చెబుతున్నారు. ఆ గుహ‌ల్లో ఆత్మ‌లు ఉన్నాయ‌నేది వారి అనుమానం. దీనివ‌ల్లే అటువైపుగా ఎవ్వ‌రూ వెళ్ల‌డానికి సాహ‌సించ‌రు.

ఇటీవ‌లే స్థానిక మీడియా ప్ర‌తినిధులంద‌రూ గుంపుగా వెళ్లి.. ఓ గంట‌పాటు మాత్ర‌మే అక్క‌డ ఉండి వెన‌క్కి వ‌చ్చేశారు. ఆ గుహ‌ల ఫొటోల‌ను విడుద‌ల చేశారు.

దీనితో ఈ ఉదంతం వెలుగులోకి వ‌చ్చింది. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని కొరియ్యా జిల్లా చిరిమిరి తాలూకా ప‌రిధిలోని ఉంటుందీ గ్రామం. కొండ‌ల మ‌ధ్య ఉండే కుగ్రామం ఇది. విసిరేసిన‌ట్టుగా ఉంటాయి అక్క‌డి నివాసాలు. దాదాపుగా అన్నీ పూరిగుడిసెలు, పెంకుటిళ్లే. దాని పేరు సాజాప‌హాడ్‌. చిరిమిరి తాలూకా బొగ్గు గ‌నుల‌కు పెట్టింది పేరు.

కొన్ని సంవత్స‌రాల కింద‌ట సాజాప‌హాడ్‌లోనూ బొగ్గు గ‌నులు ఉండేవి. 2010 మే 6వ తేదీన సాయంత్రం బొగ్గు గ‌నుల్లో ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు న‌లుగురు గ‌నుల్లో చిక్కుకుని, ఊపిరి ఆడ‌క మృతిచెందారు.

దీనిపై అప్ప‌ట్లో అన్ని ప్ర‌సార మాధ్య‌మాల్లో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఆ న‌లుగురి ఆత్మ‌లు ఇలా ఆర్త‌నాదాలు చేస్తున్నాయ‌నే పుకారు ఇప్ప‌టికీ సాజాప‌హాడ్ గ్రామంలో ఉంది.

సాయంత్రంపూట ఎవ్వ‌రూ ఆ కొండ‌గుహ‌ల స‌మీపానికి వెళ్ల‌రు. సాజాప‌హాడ్ స‌మీపంలోని అంజ‌ని హిల్స్‌లో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. దీనితో వాటిని మూసివేశారు సౌత్ ఈస్ట‌ర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ అధికారులు. అప్ప‌టి నుంచీ ఆ ప్రాంతానికి వెళ్ల‌డానికి అంద‌రూ జంకుతున్నారు.

ఇది భ్ర‌మేనంటూ కొట్టి పారేసేవారు చాలామందే క‌నిపిస్తారు గానీ.. వారెవ్వ‌రూ చీక‌టి ప‌డిన త‌రువాత ఆ కొండ‌గుహ‌ల వ‌ద్ద‌కు వెళ్లిన దాఖ‌లాలు లేవు. దీనితో ఆర్త‌నాదాల వ్య‌వ‌హారం అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌గానే మిగిలిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here