పాక్ మాజీ క్రికెట‌ర్ కుమారుడి ఆత్మ‌హ‌త్య‌: అండ‌ర్‌-19 టీమ్‌లో చోటు ద‌క్క‌లేద‌ని..!

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ ఆమీర్ హ‌నీఫ్ కుమారుడు మ‌హమ్మ‌ద్ జ‌ర్యాబ్‌ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. పాకిస్తాన్ అండ‌ర్-19 జ‌ట్టులో చోటు ద‌క్క‌క‌పోవ‌డం వ‌ల్ల తీవ్ర మ‌న‌స్తాపానికి గురై బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. పాకిస్తాన్‌లోని క‌రాచీలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

నిజానికి- జ‌ర్యాబ్‌కు ఈ ఏడాది జ‌న‌వ‌రిలో జ‌ర్యాబ్‌కు అండ‌ర్‌-19 జ‌ట్టులో చోటు ద‌క్కింది. ఆ త‌రువాత అత‌ని వ‌య‌స్సు త‌క్కువ‌గా ఉంద‌నే కార‌ణంతో జ‌ర్యాబ్‌ను జ‌ట్టు నుంచి త‌ప్పించారు. గాయం నెపంలో ఆడ‌నివ్వ‌లేద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మ‌న‌స్తాపానికి గురై.. త‌న కుమారుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని ఆమీర్ హ‌నీఫ్ ఆరోపిస్తున్నారు.

1990 ద‌శ‌కంలో హ‌నీఫ్ పాకిస్తాన్ జాతీయ జ‌ట్టు త‌ర‌ఫున అయిదు వ‌న్డే మ్యాచ్‌ల‌ను ఆడారు. ఆ త‌రువాత దేశ‌వాళీ మ్యాచ్‌ల‌కే ప‌రిమితం అయ్యారు. కోచ్ ఒత్తిళ్ల వ‌ల్లే త‌న కుమారుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని హ‌నీఫ్ విమ‌ర్శిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here