స్నేహితుడితో క‌లిసి క‌న్న‌త‌ల్లిని చెరిచాడు..గొంతునులిమి క‌డ‌తేర్చాడు..! కిరాత‌కుణ్ణి ప‌ట్టుకుని ఉతికారేసిన జ‌నం

త‌ప్ప‌తాగిన మైకంలో క‌న్న‌త‌ల్లిని చెరిచిన కుమారుడి ఉదంతం ఇది. తాను చేసిన ఘాతుకం బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌కుండా ఉండ‌టానికి ఆమెను గొంతు నులిమి క‌డతేర్చాడు.

ఈ ఘ‌ట‌న ఆంధ్ర‌-క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దుల్లోని శివుని కుప్పం గ్రామంలో చోటు చేసుకుంది. చిత్తూరుజిల్లా వి. కోట మండ‌లం ప‌రిధిలో ఉండే ఈ గ్రామం క‌ర్ణాట‌కలోని కోలార్ జిల్లా స‌రిహ‌ద్దుల‌కు ఆనుకుని ఉంటుంది.

శివునికుప్పంలో నివ‌సించే 28 సంవ‌త్స‌రాల సుబ్ర‌హ్మ‌ణ్యం అనే యువ‌కుడు అవివాహితుడు. మ‌ద్యానికి బానిస అయ్యాడు. సోమ‌వారం రాత్రి మ‌ద్యం మ‌త్తులో త‌న క‌న్న‌త‌ల్లి ఎల్ల‌మ్మ‌పై అత్యాచారం చేశాడు.

అనంత‌రం ఆమె గొంతునొక్కి హ‌త్య చేశాడు. ఈ దారుణ కృత్యానికి సుబ్ర‌హ్మ‌ణ్యం స్నేహితుడు కూడా అత‌నికి స‌హ‌క‌రించాడు. వారిద్ద‌రూ పారిపోవడానికి ప్ర‌య‌త్నించారు. ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన గ్రామ‌స్తులు.. ఇద్ద‌ర్నీ ప‌ట్టుకుని క‌రెంటు స్తంభానికి క‌ట్టేసి, చితగ్గొట్టారు.

వి. కోట పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు ఇద్ద‌ర్నీ అరెస్టు చేశారు. వారిపై కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు ఆరంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here