నేటి వన్డే గెలిస్తేనే.. అసలైన రికార్డు..!

దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టుల్లో మనం ఓ రకంగా మంచి ప్రదర్శననే ఇచ్చాం.. మొదటి రెండు టెస్టుల్లో పోరాడి ఓడిపోయాం.. టాస్ గెలిచుంటే అవి కూడా మనవే అనే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇక వన్డే సిరీస్ మొదలయ్యాక భారతజట్టు సఫారీలను చిత్తు చిత్తుగా ఓడిపోతోంది. సఫారీ జట్టు.. శ్రీలంక జట్టు అయిందేంటబ్బా అన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక నేడు జరగబోయే నాలుగో వన్డేలో భారత్ విజయం సాధిస్తే మన ఖాతాలో అరుదైన రికార్డు సొంతం అవుతుంది.

అదేంటంటే దక్షిణాఫ్రికా గడ్డపై ఐదు లేదా అంతకన్నా ఎక్కువ వన్డేల సిరీస్ గెలిచిన రెండో టీమ్‌గా భార‌త్ రికార్డు నెల‌కొల్పుతుంది. 2002లో ఆస్ట్రేలియా జట్టుకు మాత్రమే సాధ్యమైన ఈ ఘనత భారత్ అందుకోబోతోంది. వన్డేల్లో తలో 120 పాయింట్లతో వరుసగా మొదటి రెండు స్థానాల్లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి. ఈ వ‌న్డేలో భార‌త్ గెలిస్తే ఐసీసీ ర్యాంకింగ్స్ లో మ‌రికొంత రేటింగ్ తో భార‌త్ నంబర్ వన్ ర్యాంక్ పదిలమవుతుంది. గాయం కారణంగా మొదటి మూడు వన్డేలకు దూరం అయిన డివిలియర్స్ ఈరోజు దక్షిణాఫ్రికా జట్టుతో చేరనున్నాడు. ఇప్పటికే డివిలియర్స్, డికాక్ దూరం అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సిరీస్ లో భారత్ 3-0 లీడ్ తో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here