భారత్ తరపున టీ20 బెస్ట్ బౌలింగ్ అతనిదే.. చెత్త బౌలింగ్ కూడా అతనిదే.. మ్యాచ్ పోయే..!

రెండో టీ20లో భారత్ సౌత్ ఆఫ్రికా చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం, బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 18.4 ఓవర్లలోనే విజయలక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ డుమినితో పాటు క్లాసన్ తమ బ్యాటింగ్ తో రెచ్చిపోవడంతో రెండో టీ 20 మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.

ఈ మ్యాచ్ లో భారత విజయావకాశాలను యజువేంద్ర చాహల్ దెబ్బతీశాడు. వర్షం పడడంతో చాహల్ స్పిన్ ప్రభావం కనిపించలేదు. దీంతో అతన్ని టార్గెట్ చేసిన సఫారీ ఆటగాళ్ళు.. చితక్కొట్టుడు మొదలుపెట్టారు. ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లలో 64పరుగులు ఇచ్చి భారత్ తరపున అతి చెత్త బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. గతంలో జోగిందర్ శర్మ పేరిట ఉన్న 57 పరుగుల చెత్త రికార్డును చాహల్ తుడిచిపెట్టాడు. ఇక భారత్ తరపున టీ20ల్లో బెస్ట్ బౌలింగ్ కూడా చాహల్ దే.. 6-25 ఇంగ్లాండ్ మీద తీశాడు. అలాగే ఒకే మ్యాచ్ లో ఎక్కువ సిక్సర్లు కొట్టించుకున్న బౌలర్ గా కూడా చాహల్ మరో చెత్త రికార్డును అందుకున్నాడు. అతడి నాలుగు ఓవర్లలో 7 సిక్సర్లు కొట్టారు సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లు.. గతంలో జడేజా 6 సిక్సర్లు కొట్టించుకున్నాడు. ఇక రోహిత్ శర్మ కూడా మరో చెత్త రికార్డును అందుకున్నాడు. భారత్ తరపున టీ20ల్లో ఎక్కువ డకౌట్లు అయ్యింది రోహిత్ శర్మనే.. ఆశిష్ నెహ్రా, యూసుఫ్ పఠాన్ లు 3 సార్లు డకౌట్ అవ్వగా.. రోహిత్ ఏకంగా 4 సార్లు అయ్యాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here