సినిమాల‌కు గుడ్‌బై చెప్పిన లోక నాయ‌కుడు! కొత్త సినిమాలుండ‌వంటూ ప్ర‌క‌ట‌న‌!

ద‌క్షిణాది సినీ ప్రియుల‌కు షాక్‌. లోక నాయ‌కుడు క‌మ‌ల్‌హాస‌న్ సినిమాల‌కు గుడ్‌బై చెప్పారు. రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించిన ఆయ‌న ఇంత త్వ‌ర‌గా సినిమాల‌ను వ‌ద‌లుకుంటార‌ని అభిమానులు, ప్రేక్ష‌కులు ఏ మాత్రం ఊహించ‌లేదు.

ప్ర‌స్తుతం త‌న చేతిలో రెండు సినిమాలు ఉన్నాయ‌ని, వాటిని పూర్తి చేస్తాన‌ని అన్నారు. ఆ త‌రువాత కొత్త సినిమాల్లో న‌టించ‌బోన‌ని తేల్చి చెప్పారు. తాను స్థాపించ‌బోయే రాజ‌కీయ పార్టీ పేరు, ఇత‌ర విధి విధానాల‌ను ఈ నెల్లోనే ప్ర‌క‌టిస్తాన‌ని అన్నారు.

ప్రస్తుతం అమెరికాలో ఉన్న క‌మ‌ల్‌.. అక్క‌డే ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. తాను న‌టుడిగానే చ‌నిపోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌ట్లేద‌ని, 37 సంవ‌త్స‌రాల పాటు త‌న‌ను న‌టుడిగా ఆద‌రించిన కోట్లాదిమందికి సేవ చేయాల‌నే ఉద్దేశంతోనే రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్లు చెప్పారు.

రాజకీయాల్లోకి రావాల‌నే నిర్ణ‌యం ఇప్ప‌టికిప్పుడు తీసుకున్న‌ది కాద‌ని, ప‌దేళ్ల క్రిత‌మే నిర్ణ‌యం తీసుకున్న‌ాన‌ని క‌మ‌ల్ వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here