7 వేల కోట్ల రూపాయల విలువ చేసే కొకైన్ ను పట్టుకున్న పోలీసులు..!

స్పానిష్ పోలీసులు తొమ్మిది టన్నుల బరువైన కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 80,00,00,000 కోట్ల బ్రిటీష్ పౌండ్లతో సమానం.. అంటే భారత కరెన్సీలో 7384 కోట్ల రూపాయలన్నమాట..! కొలంబియా నుండి స్పెయిన్ కు వస్తున్న ఓ షిప్పింగ్ కంటయినర్ లో ఈ డ్రగ్స్ ను తరలిస్తున్నట్లు కనుగొన్నారు. వెంటనే సాయుధ బలగాలు రంగం లోకి దిగి అదుపు లోకి తీసుకున్నారు.

ఇంటీరియర్ మినిస్టర్ జువాన్ ఇగ్నాసియో జోయిదో ఈ ఘటన గురించి మాట్లాడుతూ ఇప్పటి దాకా ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నలుగురిని స్పెయిన్ లో అరెస్ట్ చేయగా ఇంకో ఇద్దరినీ ఫ్రెంచ్ సిటీ అయిన లియాన్ లో అరెస్ట్ చేశారు. మొత్తం 8.74 టన్నుల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. అరటి పళ్ళను తరలిస్తున్నట్లు తెలిపి ఏకంగా కొకైన్ ను భారీ మొత్తంలో తరలించారని చూశారు.


దక్షిణ స్పెయిన్ లో ఉన్న అల్గేసిరాస్ పోర్ట్ నుండి ఈ కార్గో షిప్ బయలుదేరినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు కార్గోను పరిశీలించగా మొత్తం బయటపడింది. ఈ ఏడాది జనవరిలో కూడా ఆరు టన్నుల కొకైన్ ను అధికారులు పట్టుకున్నారు. అల్గేసిరాస్ నుండి చాలా వరకూ స్పెయిన్ దేశం లోకి డ్రగ్స్ వస్తూ ఉంటాయని అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here