వెరైటీ అంటే ఇదే! జేసీబీలో కూర్చుని పెళ్లి ఊరేగింపు!

జీహ్వ‌కో రుచి అనేది పా…త చింత‌కాయ ప‌చ్చ‌డి టైపు సామెతే అయిన‌ప్ప‌టికీ.. ఈ జంట‌కు మాత్రం అది అతికిన‌ట్టు స‌రిపోతుంది. అంద‌రి లాగా- గుర్ర‌మో, కారో.. క‌నీసం ట్రాక్ట‌రో ఎక్కి ఊరేగ‌లేదా జంట‌. ఏకంగా- ఓ జేసీబీని ఎంచుకుంది. ఎంచ‌క్కా అందులో కూర్చుని పెళ్లి ఊరేగింపు జ‌రిపించేసుకున్నారు. ముచ్చ‌ట తీర్చుకున్నారు.

 

ఈ వెరైటీ ఊరేగింపు క‌ర్ణాట‌క‌లోని ద‌క్షిణ క‌న్న‌డ జిల్లా పుత్తూరులో చోటు చేసుకుంది. ఆ జంట పేరు చేత‌న్‌కుమార్‌, మ‌మ‌త.. సోమ‌వారం ఉద‌యం పుత్తూరులోని సెంట్యార్‌లో వారి పెళ్లి జ‌రిగింది. అనంత‌రం- వారిద్ద‌రూ జేసీబీలో కూర్చుని ఊరేగింపుగా వెళ్లిపోయారు.

మాణి-మైసూరు జాతీయ ర‌హ‌దారిపై సుమారు రెండు కిలోమీట‌ర్ల ఈ ఊరేగింపు కొన‌సాగింది. ఈ నూత‌న వ‌ధూవ‌రుల‌ను జ‌నం ఆశ్చ‌ర్యంగా చూసిన‌ప్ప‌టికీ.. మ‌న‌సారా ఆశీర్వ‌దించారు. ఇక్క‌డో లైట్ ట్విస్ట్ ఏమిటంటే.. వ‌రుడు చేత‌న్ జేసీబీ డ్రైవ‌ర్‌. అందుకే- తాను నిత్యం న‌డిపించే జేసీబీలోనే త‌న పెళ్లి ఊరేగింపును కూడా నిర్వ‌హించుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here