ప్రయాణీకులకు స్పైస్ జెట్.. స్పైసీ ఆఫర్.. 769 కే విమాన ప్రయాణం..!

ఇటీవలి కాలంలో విమానయాన సంస్థల మధ్య కూడా విపరీతమైన పోటీ పెరిగిపోతోంది. సందర్భానికి అనుగుణంగా పలు సంస్థలు ఆఫర్లను ప్రకటిస్తూ ఉన్నాయి. తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా ‘స్సైస్‌ జెట్‌’విమానయాన సంస్థ ప్రయాణీకులకు సరికొత్త ఆఫర్లను ప్రవేశపెట్టింది. పరిమిత కాలముండే ప్రమోషనల్‌ ఆఫర్‌ ను ‘గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌’గా పేర్కొంది. ఈ ఆఫర్ లో ప్రయాణికులు వన్ వే ట్రిప్ కోసం 769 రూపాయల ప్రారంభ ధరతో టికెట్లు కొనుగోలు చేయవచ్చు.

ఇక విదేశీ వన్‌ వే ప్రయాణానికి 2,469 రూపాయల ప్రారంభ ధరతో టికెట్లను కొనుగోలు చేయవచ్చని స్పైస్ జెట్ ప్రకటించింది. ఈ ఆఫర్ జనవరి 25 వరకు అందుబాటులో ఉంటుందని స్పైస్ జెట్ ప్రకటించింది. ఈ ఆఫర్‌ లో భాగంగా టికెట్లను బుక్‌ చేసుకున్నవారు ఈ ఏడాది డిసెంబర్‌ 12లోపు ఎప్పుడైనా ప్రయాణించవచ్చని ప్రకటించింది. అలాగే ఎస్బీఐ కార్డులు వాడే వారికి ప్రియారిటీ చెకింగ్ లో 10 శాతం ఫ్రీ కూడా ఇవ్వనున్నారు. అందుకు SBISALE అనే ప్రోమో కోడ్ ను వాడవలసి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here