ప్ర‌ధాని మోడీ ఆధ్యాత్మిక గురువు ఆత్మ‌హ‌త్య‌! వేళ్ల‌న్నీ ఆయ‌న రెండో భార్య వైపే!

కొమ్ములు తిరిగిన బీజేపీ నేత‌లు.. ఆ మాట‌కొస్తే, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ కూడా ఆయ‌నకు చేతులు ఎత్తి మొక్కుతారు. దాదాపు కేంద్ర‌మంత్రులంద‌రూ ఆయ‌న‌ను ద‌ర్శించుకున్న వారే. ఆయ‌న ఆశీస్సుల‌ను పొందిన వారే. సాక్షాత్తూ ప్ర‌ధ‌న‌మంత్రి న‌రేంద్ర‌మోడీకి ఆధ్యాత్మిక గురువు. ప‌లుమార్లు మోడీ ఆ గురువును ద‌ర్శించుకున్నారు.

 

అంతేనా! మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఆ ఆధ్యాత్మిక గురువుకు మంత్రి హోదాను కూడా క‌ట్టబెట్టింది. అలాంటి హై ప్రొఫైల్ స్పిరిచ్యువ‌ల్ లీడ‌ర్‌.. సంత్ భ‌య్యూ మ‌హ‌రాజ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. త‌న స‌ర్వీస్ రివాల్వ‌ర్‌తో ఆయ‌న త‌న‌ను తాను కాల్చుకున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ఇండోర్‌లోని త‌న ఆశ్ర‌మంలో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ఆయ‌న బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. త‌న ఆశ్ర‌మంలో.. ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉన్న భ‌య్యూ మ‌హ‌రాజ్‌ను ఆయ‌న శిష్యులు ఇండోర్‌లోని బోంబే ఆసుప‌త్రికి త‌రలించారు. అప్ప‌టికే ఆయ‌న మ‌ర‌ణించిన‌ట్లు డాక్ట‌ర్లు ధృవీక‌రించారు.

హై ప్రొఫైల్ ఆధ్యాత్మిక గురువు భ‌య్యూ మ‌హరాజ్ ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం.. బీజేపీ నాయ‌కులు ఉలిక్కిప‌డ్డారు. ఆయ‌న ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం.. కుటుంబ క‌ల‌హాలేన‌ని ప్రాథ‌మిక స‌మాచారం. 49 సంవ‌త్స‌రాల భ‌య్యూ.. గత ఏడాది ఏప్రిల్ 30వ తేదీన రెండో వివాహం చేసుకున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ గ్వాలియ‌ర్‌కు చెందిన డాక్ట‌ర్ ఆయుషీని ఆయ‌న రెండో పెళ్లి చేసుకున్నారు.

ఆయ‌న మొద‌టి భార్య మాధ‌వి 2015 న‌వంబ‌ర్‌లో మ‌ర‌ణించారు. భ‌య్యాజీ, మాధ‌వి దంప‌తుల‌కు ఓ కుమార్తె. ప్ర‌స్తుతం ఆమె పుణేలో చ‌దువుకుంటున్నారు. భార్య ఆయూషీతో మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్తాయని, అవే ఆత్మ‌హ‌త్య‌కు పురిగొల్పి ఉంటాయ‌ని అనుచ‌రులు భావిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై ఇండోర్ పోలీసులు కేసు న‌మోదు చేసుకుని, ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఆత్మ‌హ‌త్య‌కు కొన్ని క్ష‌ణాల ముందు కూడా ఆయ‌న ఓ ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here