ఊపిరి పీల్చుకో టీమిండియా! మూడు వ‌న్డేలకు డివిలియ‌ర్స్ దూరం

టెస్ట్ సిరీస్‌ను పోగొట్టుకుని ఇక వ‌న్డే సిరీస్ కోసం ఉత్కంఠ‌త‌గా ఎదురు చూస్తోన్న కోహ్లీ సేన.. ఇక కాస్త ఊపిరి పీల్చుకోవ‌చ్చు. ప్రొటీస్ జ‌ట్టు బ్యాటింగ్ వెన్నుముక‌, బ్యాటింగ్ వాల్క‌నో ఏబీ డివిలియ‌ర్స్ వ‌న్డేల‌కు దూరం అయ్యాడు.

మూడోటెస్ట్ రెండో ఇన్నింగ్‌లో బ్యాటింగ్ చేస్తూ గాయ‌ప‌డ్డ ఏబీడీ.. వ‌న్డేల్లో ఆడ‌ట్లేదు. బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో అత‌ని చూపుడు వేలికి గాయమైంది.

వ‌న్డే సిరీస్ నాటికి తేరుకోగ‌ల‌డ‌ని టీమ్ మేనేజ్‌మెంట్ భావించింది. గాయం నుంచి ఏబీడీ పూర్తిగా కోలుకోలేదు. దీనితో అత‌ను తొలి మూడు వ‌న్డేల్లో ఆడ‌ట్లేద‌ని ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్ల‌డించింది.

ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి కనీసం రెండు వారాల సమయం ప‌డుతుండ‌ట‌. టీమిండియాకు ఇది శుభ‌వార్తే.
నాలుగో వన్డే సమయానికి అతను ఫిట్‌గా ఉండే అవకాశం ఉంది.

తొలి మూడు వన్డేలకే టీమ్‌ను ఎంపిక చేసిన సౌతాఫ్రికా.. డివిలియర్స్ స్థానంలో ఇంకా ఎవ‌ర్నీ తీసుకోలేదు. గురువారం నుంచి ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య ఆరు వన్డేల సిరీస్ మొదలవనుంది. డర్బన్‌లోని కింగ్స్‌మీడ్‌లో తొలి వన్డే జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here