నీవు శేఖర్ కమ్ముల అయితే నాకేంటి, నీ దగ్గర డబ్బులు ఉంటే నాకేంటి..? రెచ్చిపోయిన శ్రీరెడ్డి..!

రోజు రోజుకీ శ్రీరెడ్డి చేస్తున్న కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీరెడ్డి తన గురించి చేసిన కామెంట్లపై శేఖర్ కమ్ముల ఫైర్ అయ్యారు. తనాకు క్షమాపణలు చెప్పకుండా ఉంటే లీగల్ గా వెళతానని చెప్పారు. దీనిపై శ్రీ రెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్ లైవ్ లో ఫైర్ అయింది.

‘నీ పేరు మెన్షన్ చేశానా లేక నీ సినిమా పేరు మెన్షన్ చేశానా… జైల్లో పెట్టిస్తానంటున్నావు శేఖర్ కమ్ములా ఈ రోజు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘చట్ట ప్రకారం వెళ్తావా? వెళ్లు, నాకేమైనా భయమా? నీవు శేఖర్ కమ్ముల అయితే నాకేంటి, నీ దగ్గర డబ్బులు ఉంటే నాకేంటి?’ అంటూ ప్రశ్నించింది. మీరు తప్పు చేయనప్పుడు సైలెంట్ గా ఉండవచ్చు కదా అని చెప్పింది. తాను కూడా లీగల్ గా యాక్షన్ తీసుకోబోతున్నానని… త్వరలోనే నోటీసులు అందుతాయని తెలిపింది.

సినీ పరిశ్రమలో ఉన్న పెద్దలకు ఒకటే చెబుతున్నానని… తాను ఒంటరిని అయినప్పటికీ, తనకు కావాల్సినంత ధైర్యం ఉందని చెప్పింది. పోరాటానికి డబ్బులు అవసరం లేదని, గుండెలో ధైర్యం ఉంటే చాలని తెలిపింది. త్వరలోనే అన్ని ప్రూఫ్ లూ పెడతానని చెప్పుకొచ్చింది. తాను చేసేది నిజంగా గోలగా అనిపిస్తే.. తన ఫేస్ బుక్ పేజి నుండి వెళ్ళిపోవాలని చెప్పింది. తనకు వార్నింగ్ ఇవ్వాలని ఎవరైనా ట్రై చేస్తే తాను ఎక్కడికీ తగ్గనని చెప్పుకొచ్చింది. కోర్టులకు తిరుగుతానని తనకు ఎలాంటి భయం లేదని చెప్పింది.

Sri Reddyさんの投稿 2018年4月3日(火)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here