దిల్ రాజు గారు.. మీరు పోతే శని వదిలిపోయింది అనుకుంటారు.. బతికుండగానే దయచేసి మారండి..!

ప్రస్తుతం శ్రీ రెడ్డి గురించి తెగ చర్చించుకుంటూ ఉన్నారు. టాలీవుడ్ లో అమ్మాయిలను ఎలా వేధిస్తున్నారో ఆమె బయటపెడుతూ వస్తోంది. ప్రస్తుతం పెద్ద పెద్ద వాళ్ళతో ఛాటింగ్ లను కూడా బయటపెట్టేసింది. ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజును టార్గెట్ చేసింది శ్రీ రెడ్డి. దిల్ రాజు పోతే శని వదిలిపోతుందని వ్యాఖ్యానించింది. ఆయన కుల రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించింది. ఆయన చేతుల్లో ఎంతో మంది నలిగిపోతున్నారని చెప్పింది.

ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెడుతూ “కుళ్లు రాజకీయాలు వద్దన్నా. ఆడ పిల్లలన్నా. బతకనిద్దామన్నా పాపం. దిల్ రాజు (రెడ్డి) గారూ… ప్లీజ్ సంకెళ్లు వేసిన కళామతల్లిని బంధ విముక్తురాలిని చేయండి. మీరు పోతే శని వదిలిపోయింది అనుకుంటారు. బతికుండగానే దయచేసి మారండి. వట్టి చేతులతో పోతాం. మంచిపేరుతో పోదామన్నా మనమందరం. త్యాగం అన్నా… టాలెంట్ ను చంపొద్దు అన్నా. మీరంతా మంచివారు. దయచేసి నా విజ్ఞప్తిని పరిశీలించండి” అని వ్యాఖ్యానించింది. తాము అమ్మాయిలమని, అంగట్లో సరుకులం కాదని మరో పోస్టులో చెప్పింది.

Kula rajakeeyalu vadhanna.. aada pillalanna..bhathakanidhamanna papam..dil raju(reddy) garu please sankellu vesina…

Sri Reddyさんの投稿 2018年4月10日(火)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here