శేఖర్ కమ్ముల మీద తీవ్ర ఆరోపణలు చేసిన శ్రీ రెడ్డి.. ఏమందంటే..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రీ రెడ్డి చేస్తున్న లీకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎంతో మంది నిజస్వరూపాలు బయటపెడుతూ వస్తోంది శ్రీరెడ్డి. అలాగే మరికొందరి మీద తీవ్రమైన కామెంట్స్ కూడా చేస్తూ ఉంది. కొద్ది రోజుల క్రితం ఈ టీవీలో పని చేసే ఓ పెద్ద వ్యక్తి మీద కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి ఇప్పుడు ఏకంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీద కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసింది.


“పెద్ద డైరెక్టర్ అని పోజు. అబద్ధాలు చెప్పడంలో దిట్ట. తెలుగు అమ్మాయిలంటే పక్కలోకి తప్ప ఎందుకూ పనికిరారని ప్రగాఢ విశ్వాసం. ప్రామిస్ లను బ్రేక్ చేయడంలో వీరి తర్వాతే ఎవరైనా. బక్కపీచు సోగ్గాడు. ఊదితే ఎగిరిపోయే ఇతనికి భయం, బలం రెండూ ఎక్కువే. టెక్నికల్ గా దొరక్కుండా టెక్నాలజీని బాగా వాడాడు. మా ఇంటి కింద గూర్ఖాలా తిరిగేవాడు. వీడియో కాల్ కోసం ఏమైనా కోసేసుకుంటాడు పాపం. మగ ఆర్టిస్టుల దగ్గర డబ్బులు గుంజుతాడని టాక్. వీరెవరో కాదు కొమ్ములు వచ్చిన శేఖర్” అంటూ శేఖర్ కమ్ములపై శ్రీరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

సాధారణంగా శేఖర్ కమ్ముల తన సినిమాల్లో కొత్త వారికీ, తెలుగు వాళ్ళకూ ఛాన్స్ ఇస్తూ ఉంటాడు. అంతేకాకుండా పెద్దగా ఆయన మీద వివాదాలు కూడా లేవు.. అలాంటిది ఆయన మీద శ్రీ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం గురించే అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. శ్రీ రెడ్డి చెప్పింది నిజాలా.. లేక ఆమెకు ఛాన్స్ ఇవ్వకపోవడం వలన చేస్తున్న ఆరోపణలా అన్నది తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here