ఏమి చేద్దాం నాని.. నీకు నాకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటదన్న శ్రీరెడ్డి.. బిగ్ బాస్ ట్విస్ట్ ఏమిటో..!

బిగ్ బాస్ సీజన్-2 మొదలవ్వడానికి టైమ్ దగ్గర పడుతోంది. ఇంకా ఈ షోలో పాల్గొనే వాళ్లకు సంబంధించిన క్లారిటీ ఇంకా రాలేదు. కొద్ది రోజుల క్రితం ఓ లిస్టు బయటకు వచ్చినా.. అది ఫేక్ అనే అర్థం అయిపోయింది. ఇక షో గురించి ఎంత మాట్లాడుకుంటూ ఉన్నారో.. శ్రీ రెడ్డి షోలో ఉంటుంది కదా అన్న విషయంపై కూడా ఎక్కువగానే మాట్లాడేశారు.

Nani ki,naku pacha gaddi veste baggu mantadhi..yem chedham nani mari??

Sri Reddyさんの投稿 2018年6月3日(日)

దీనిపై ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోయినా.. శ్రీ రెడ్డి అయితే పాల్గొనబోయే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. బిగ్ బాస్ మీద స్పందించింది కానీ.. వెళ్తున్నానా లేదా అన్నది చెప్పలేదు. ఆమె స్పందించింది కూడా నాని మీదనే..! “నానికి నాకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటది.. ఏమి చేద్దాం నాని మరీ” అని ఆమె తాజాగా పోస్ట్ పెట్టింది. ఇక దాని కింద ఇన్ ఫ్రంట్ దెరీజ్ క్రొకోడైల్ ఫెస్టివల్ అని ఒకరు పోస్ట్ పెట్టగా “నాని ముందు ఎంత పెద్ద క్రొకోడైల్ అయినా వేస్ట్” అంటూ కామెంట్ పెట్టి వివాదాన్ని మరింత రాజేసింది. ఇంత జరుగుతున్నా బిగ్ బాస్-2 లో శ్రీ రెడ్డిని తీసుకుంటారా అన్నది సందేహమే..! ఇంకొద్ది రోజులు ఎదురుచూస్తే ఎవరు ఉంటారో.. ఎవరు ఉండరో అర్థం అయిపోతుంది మనకు..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here