నారా లోకేష్ ను ఏమన్నా అంటే ఊరుకోను.. నా నోటికి పని చెప్పొద్దన్న శ్రీరెడ్డి.. ఎందుకో..!

శ్రీరెడ్డి.. ఎప్పుడు ఏ విషయం మీద స్పదిస్తుందో ఆమెకే తెలియాలి. తాజాగా శ్రీ రెడ్డి నారా లోకేష్ కోసం మాట్లాడింది. నారా లోకేష్ కు ఆమె మద్దతుగా మాట్లాడుతూ ఎవరైనా కానీ నారా లోకేష్ ను ఏమన్నా అంటే బాగోదని.. తన నోటికి పని చెప్పొద్దని వార్నింగ్ ఇచ్చింది. నారా లోకేష్ కు మద్దతుగా మాట్లాడడమే కాకుండా.. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి కోసం కూడా ప్రత్యేకంగా కొన్ని పోస్టులు పెట్టుకొచ్చింది. మరో పోస్ట్ లో పవన్ కళ్యాణ్ ను తిట్టడమే కాకుండా.. చిరంజీవి మీద కూడా ఆమె ఏదేదో మాట్లాడింది.

Nara lokesh garini yevaranna yemanna ante vurukunevaru evvaru leru.. kotha party yem chesthundho adhi cheppukondi anthe vimarsalu chesthe oppukunedhi ledhu..na notiki pani cheppodhu ..

Sri Reddyさんの投稿 2018年6月4日(月)

“నారా లోకేశ్ గారిని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేవాళ్లు ఎవరూ లేరు. కొత్త పార్టీ ఏం చేస్తుందో అది చెప్పుకోండి. అంతేగానీ లోకేశ్ ను విమర్శిస్తే ఒప్పుకునేది లేదు. నా నోటికి పని చెప్పొద్దు” అని లోకేశ్ కు శ్రీరెడ్డి సపోర్ట్ గా నిలిచింది.

ఇక వైసీపీ అధినేత జగన్‌పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘జగనన్నలా ఓర్పు మీకెక్కడ ఉంది. అన్న ఫ్యామిలీ లక్షల మందికి చేసిన సహాయాలు ఎవరూ మర్చిపోలేదు. సినిమా డైలాగ్ కొట్టి.. వాటర్ తాగినంత సులభం కాదు. మీ అన్న రాజకీయాలు.. మీ అన్న సినిమాల్లో ఎంతమందిని తొక్కాడో ఎవరికి తెలియదు. మా అసోసియేషన్‌లో కార్డు పీకేగారి మీద ఉన్న గౌరవంతో మీ అన్న నాకు ఇవ్వనివ్వడం లేదు. మీ చలవే కదా’ అని పవన్ కళ్యాణ్ కు కౌంటర్ వేస్తూ మాట్లాడింది.

Jagan Anna la orpu mekekkada vundhi??jagan Anna family lakshala mandhiki chasina sahayalu yevaru marchipoledhu.. …

Sri Reddyさんの投稿 2018年6月4日(月)

ఇక తాజాగా చిరంజీవి గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు ఆమె కౌంటర్లు సంధించింది. ‘మీ అన్న తిరుపతి నుంచి ఎన్నికైన తర్వాత.. ఐదేళ్లలో కేవలం ఒకే ఒక్కసారి అక్కడికి వెళ్లారు. వాళ్ల కోసం ఒక్క పైసా ఖర్చు పెట్టలేదని.. ఎక్కడా కూడా తిరుపతి అభివృద్ధి గురించి మాట్లాడలేదని.. అక్కడి ప్రజల ఉవాచ. చంద్రబాబు గారు తిరుపతిలో తీసుకొచ్చిన ప్రాజెక్టులు, చేసిన అభివృద్ధి ప్రజలందరికి తెలుసు. పాలనపై అవగాహన లేనివారిని ఎన్నుకొని తప్పు పని చేయొద్దని మనవి అంటూ’ వరుసగా పోస్టులు పెడుతూ వస్తోంది.

Me Anna Tirupati nunchi yennikaina tarvatha,5 yearslo kevalam oke okkasari tirupati ki vacharani,vallakosam single…

Sri Reddyさんの投稿 2018年6月4日(月)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here