పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన శ్రీ రెడ్డి.. ఎవరి మీదంటే..!

క్యాస్టింగ్ కౌచ్.. తెలుగు సినీ పరిశ్రమను ప్రస్తుతం కుదిపేస్తోంది. ఒకరి తర్వాత.. ఒకరి పేర్లు.. బయటకు వస్తూనే ఉన్నాయి. దీనిపై పవన్ కళ్యాణ్ లాంటి సినిమా పెద్దలు స్పందించాలని కోరగా.. పవన్ కళ్యాణ్ కొన్ని సూచనలను చెప్పారు. రోడ్డెక్కడం.. టీవీ ఛానెళ్లలో కూర్చుని డిస్కషన్లు చేపట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. దాని బదులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి తమకు అన్యాయం చేసిన వాళ్లపై ఫిర్యాదు చేయాలని పవన్ సూచించారు. ఆయన అన్నట్లుగానే శ్రీ రెడ్డి పోలీసులను ఆశ్రయించింది. అయితే కంప్లయింట్ చేసింది.. ఆమెను హింసించిన వారిపై కాదు.. కరాటే కళ్యాణి, సత్య చౌదరి మీద.

ఆమెపై కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు గుప్పిస్తూ.. అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తున్న కరాటె కళ్యాణి.. సత్య చౌదరిల మీద ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. హుమయూన్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి వీళ్లిద్దరిపై ఆమె ఫిర్యాదు చేసింది. ఆమె అభిరామ్ మీదో.. కోన వెంకట్.. ఆమెకు మెసేజ్ లు చేసిన వాళ్ళ మీదో ఫిర్యాదు చేయలేదు. ఆమెను తీవ్రంగా దూషిస్తూ.. ఆరోపణలు చేసిన కళ్యాణి.. సత్య చౌదరిల మీద చర్యలు చేపట్టాలని ఆమె ఫిర్యాదు చేసింది. తనను అవకాశాల పేరుతో సినీ పరిశ్రమలో చాలామంది వాడుకున్నారని.. తెలుగు నటీనటులకు అవకాశాలివ్వకుండా అన్యాయం చేస్తున్నారని శ్రీ రెడ్డి చిన్నపాటి ఉద్యమాన్నే చేస్తోంది. ఆమెకు ఎంతో మంది మద్దతు తెలుపుతున్నారు కూడానూ..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here