తల్లిని చూసి ఏడ్చేసిన శ్రీ రెడ్డి.. దయచేసి తన తల్లిదండ్రులను బయటకు లాగకండి..!

శ్రీ రెడ్డి తల్లిదండ్రులను మొదటసారి టీవీల్లో చూపించారు. వారి తల్లిదండ్రులతో మాట్లాడిన వీడియో చూపించినప్పుడు శ్రీ రెడ్డి బిగ్గరగా ఏడ్చేసింది. తన తల్లిదండ్రులతో చాలా రోజుల నుండి మాట్లాడడం లేదని.. సినిమాల కోసం ఇంటి నుండి బయటకు వచ్చేశానని.. అప్పటి నుండి ఇంట్లో వాళ్ళు పెద్దగా మాట్లాడడం లేదని చెప్పుకొచ్చింది. ఇక తన తల్లిదండ్రులకు తాను చేసిన నిరసన నచ్చడం లేదని.. వారికి ఇవేవీ తెలీవని చెప్పుకొచ్చింది శ్రీ రెడ్డి.

ఈరోజు ఉదయం ఈ విషయంపై శ్రీ రెడ్డి ట్వీట్ చేసింది. మా అమ్మగారిని మీడియా ఇబ్బంది పెట్టడం 1000 శాతం తనకు నచ్చలేదని చెప్పుకొచ్చింది. అంతంత మాత్రాన ఉన్న సెక్యూరిటీ దృష్టిలో పెట్టుకొని ఇలాంటివి చేయకండి. అవతల వాళ్ళ ప్రైవసీని దృష్టిలో పెట్టుకోవాల్సింది గా మీడియా కి నా సలహా.. ఆమె ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు అని చెప్పుకొచ్చింది. ‘మా’ నన్ను రోడ్డు మీదకు వేసింది.. మీడియా దయచేసి మా తల్లిదండ్రులను రోడ్డు మీదకు లాగకండి అని చెప్పుకొచ్చింది శ్రీ రెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here