శ్రీ రెడ్డి గురించి ట్వీట్ చేసిన ఆర్జీవీ.. పవన్ కళ్యాణ్ ని కూడా లాగాడు..!

శ్రీ రెడ్డి క్యాస్టింగ్ కౌచ్ మీద నిరసన తెలియజేస్తూ చాలా రోజులుగా పోరాటం చేస్తోంది. అలాగే తనకు ‘మా’లో సభ్యత్వాన్ని ఇవ్వలేదని చెబుతూ అర్ధ నగ్నంగా నిరసన తెలియజేయడంతో దేశవ్యాప్తంగా పాపులర్ అయింది ఈ వార్త. దీనిపై ఈరోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెస్ మీట్ పెట్టింది.

ఆమెకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సభ్యత్వం రాదని, కేవలం చీప్ పబ్లిసిటీ కోసమే దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ, అర్థనగ్నంగా తిరిగిందని ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా వ్యాఖ్యానించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ అమ్మాయికి సభ్యత్వం ఇవ్వడం జరగని పనని తేల్చి చెప్పారు. ‘మా’ అసోసియేషన్‌లో ఉన్న 900 మంది సభ్యులు శ్రీరెడ్డితో నటించబోరని, ఒకవేళ ఎవరైనా ఆమెతో నటిస్తే అసోసియేషన్‌ నుంచి వారిని తొలగిస్తామని హెచ్చరించారు. మూవీ ఆర్టిస్ అసోషియేషన్‌ లో సభ్యత్వం కావాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయని, అవి ఎవరికైనా ఒకటేనని అన్నారు.

ఇంతలో శ్రీ రెడ్డి గురించి రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.. శ్రీరెడ్డి జాతీయ స్థాయిలో సెలబ్రిటీగా ఎదుగుతోందని.. ముంబయిలో పవన్ కళ్యాణ్ గురించి తెలియని వారు సైతం శ్రీరెడ్డి గురించి మాట్లాడుకుంటున్నారన్నారు. అయితే ఆర్జీవీ ఈ ట్వీట్ ఎందుకు చేశారో.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని ఎందుకు దీనిలో లాగారో ఆయనకే తెలియాలి. చూస్తుంటే శ్రీరెడ్డి ఇంకొన్ని రోజులు వార్తల్లో నిలిచే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here