ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది.. ఇద్దరు సీఎంలు, మంత్రులు మాత్రమే మాట్లాడటం లేదు..!

నటి శ్రీ రెడ్డికి సంబంధించి.. ప్రతి ఒక్కరూ చర్చించుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే ఆమె అర్ధనగ్న ప్రదర్శన చేసిందో.. అప్పటి నుండి నేషనల్ లెవల్ లో హైప్ వచ్చింది. అయితే ప్రపంచం మొత్తం తన గురించి మాట్లాడుతోందని.. మన ముఖ్యమంత్రులు మాత్రం మాట్లాడడం లేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఫిల్మ్ చాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసి సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి, తన ఫేస్ బుక్ ఖాతాలో తెలుగు రాష్ట్రాల సీఎంల గురించి మాట్లాడింది. ఈ ఉదయం తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టును పెడుతూ, “ప్రపంచమంతా నా నిరసన గురించి చర్చించుకుంటోంది. కానీ మన మంత్రులు, ఇద్దరు సీఎంలు మాత్రం దీని గురించి మాట్లాడక పోవడం చాలా బాధాకరం” అని వ్యాఖ్యానించింది. ఇక శ్రీరెడ్డి చేసిన పోరాటం కరెక్ట్ అని.. కానీ ఆమె చేసిన పని తప్పు అని అందరూ అంటున్నారు. శ్రీ రెడ్డి అలా చేసి తప్పు చేసిందని ‘మా’ అసోసియేషన్ వ్యాఖ్యానించింది.

Whole world is discussing about our protest,how sad our ministers nd both c.ms are not talking about this

Sri Reddyさんの投稿 2018年4月9日(月)

‘‘నేను పబ్లిసిటీ కోసం ఇదంతా చేయలేదు. నాతో నటించేవారిని బ్యాన్ చేస్తామనడం సరికాదు. నన్ను బద్నాం చేయాలని చూస్తున్నారు. తెలుగు ఆర్టిస్టుల మేలు కోసమే నా పోరాటం. ఆర్టిస్టులను తొక్కేసే అధికారం ‘మా’కు లేదు’’ అని ఆ తర్వాత శ్రీ రెడ్డి అంది. ప్రజాస్వామ్యంలో నన్ను అంటరానిదానిలా పరిగణిస్తున్నారు. నాతో ఎవరూ నటించొద్దని చెబుతున్నారు. నాకు పబ్లిసిటీ కావాలంటే నేను సినిమాలే చేసుకునేదాన్ని. విప్పుకోవల్సిన అవసరం ఏముంది? నా బట్టలు నేను ఊడదీసుకోలేదు. తెలుగు కళామ్మ తల్లి బట్టలు మీరే ఊడదీశారు. మేం చెప్పినట్లే మీరు వినాల్సిందే అన్నట్లుగా ‘మా’ ప్రవర్తిస్తోంది అని విమర్శలు గుప్పించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here