డబ్బులు కట్టిన శ్రీరెడ్డి..!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో తనకు సభ్యత్వం ఇవ్వడం లేదని మొదట మీడియా ముందుకు వచ్చిన శ్రీ రెడ్డి.. ఆ తర్వాత చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. క్యాస్టింగ్ కోచ్ గురించి ఒకానొక దశలో ఆమె అద్భుతమైన పోరాటాన్నే చేశారు. కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ను దూషించడంతో అది కాస్తా మరుగున పడిపోయింది. అంతేకాకుండా ఆమెను టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు.

అయితే ఇప్పుడు ‘మా’ లో సభ్యత్వం కోసం డబ్బులు కట్టడానికి రెడీ అయింది శ్రీరెడ్డి. ఒకప్పుడు ఫ్రీగా ఇవ్వండి అని అన్న శ్రీ రెడ్డి.. ఇప్పుడు అందుకు సంబంధించిన చెక్ ను సమర్పించింది. చెక్కు ఇచ్చేశానని.. సభ్యత్వం కోసం మరో దరఖాస్తు నింపాల్సి ఉందని శ్రీ రెడ్డి చెప్పింది. ఆ ఫామ్ అడిగితే.. ‘మా’ సభ్యులు విదేశాల్లో ఉన్నారని.. ఇంకో ఐదారు రోజుల్లో ఇండియాకు వస్తారని.. అప్పుడు ఇస్తామని చెప్పారని వెల్లడించింది. ‘మా’లో తనకు సభ్యత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా తన పోరాటం మాత్రం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేసింది. సభ్యత్వ కార్డు ఇస్తే మా సభ్యురాలిగా తన పోరాటం ఒక తరహాలో ఉంటుందని.. ఇవ్వకపోతే మరోలా పోరాడతానని చెప్పుకొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here