పోలీసు కంప్లయింట్ ఇచ్చిన శ్రీ రెడ్డి.. ఎవరి మీదో.. మొత్తం ఎంతమంది మీదో తెలుసా..?

శ్రీ రెడ్డికి న్యాయపోరాటం చేయమని పవన్ కళ్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే..! ఓ వైపు ఆమె సోషల్ మీడియాలో ఆయన మీద కామెంట్లు చేస్తూనే ఉండగా.. మరోవైపు పోలీసులను కూడా ఆశ్రయిస్తోంది. తాజాగా ఆమె పోలీసులకు కొందరి మీద ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు చేసిన వారిలో నటి,దర్శకురాలు జీవితా రాజశేఖర్, హేతువాది బాబు గోగినేని, పవన్ కళ్యాణ్ అభిమానులు, పలువురు సినీ నటులు, ఆర్టిస్టులు ఉన్నాయి. ఆమె మొత్తం 28 మందిపై హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

ఆదివారం హుమయూన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఆసిఫ్‌నగర్ ఏసీపీ అశోక్ చక్రవర్తికి ఈ మేరకు వినతి పత్రం అందించింది. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. సైబర్ క్రైం సహకారంతో ఫిర్యాదులోని అంశాలపై వివరాలు సేకరించి, న్యాయ సలహా తీసుకుని కేసు నమోదు చేస్తామని శ్రీరెడ్డికి ఏసీపీ హామీ ఇచ్చారు. ఫేస్‌బుక్‌లో తనపై దుష్ర్పచారం ఆగలేదని, కొందరు కావాలని, పనికట్టుకుని తనపై ఇటువంటి ప్రచారం చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here