సాక్ష్యాలు అన్నీ ఇచ్చేశాను.. నాకేమైనా అయితే అందరి పేర్లూ టీవీలో వస్తాయి..!

తనకు ఏమైనా జరిగితే అందరి పేర్లు కూడా టీవీ ఛానల్ లో వచ్చేస్తాయని శ్రీ రెడ్డి చెప్పింది. ఈరోజు ఉదయం తన ఫేస్ బుక్ అకౌంట్ లో వీడియో పెట్టింది. తనకు జరిగిన అన్యాయాలకు సంబంధించిన అన్ని వీడియో సాక్ష్యాలూ మహా టీవీకి అందించిన తరువాతనే సదరు చానల్ తన సమస్యను బయటి ప్రపంచానికి వెల్లడించేందుకు ముందుకు వచ్చిందని చెప్పింది. తనకేదైనా జరిగితే, అందరి పేర్లూ టీవీలో ప్రత్యక్షమవుతాయని హెచ్చరించింది.

అలాగే తన వెనుక ఏ రాజకీయ పార్టీ కూడా లేదని చెప్పుకొచ్చింది శ్రీ రెడ్డి. తాను రెండున్నరేళ్ల పాటు సాక్షి టీవీ ఉప్పు తిన్నానని, ఆ చానల్ తనకు అన్నం పెట్టిందని, అటువంటి చానల్ ను, యాజమాన్యాన్ని అపఖ్యాతి పాలు చేసేంతటి దరిద్రురాలిని కాదని చెప్పింది. తాను టీడీపీతో కుమ్మక్కు కాలేదని, తనకు రాజకీయ పార్టీలతో ఎటువంటి సంబంధం లేదని చెప్పింది. పోరాటం చేస్తున్న తనకు మీడియా ఓ స్టేజ్ క్రియేట్ చేసిందని, అటువంటి మీడియాపై నిందలేస్తే, అందరి జాతకాలనూ బయటపెడతానని హెచ్చరించింది.

Mahaa Tv ki ranku antagadithe,nipputho illu kadukunnatte..agni ni sudhi cheyalani try cheyakandi

Sri Reddyさんの投稿 2018年4月9日(月)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here