నిషేధం ఎత్తివేతపై స్పందించిన శ్రీ రెడ్డి..!

శ్రీరెడ్డిపై నిషేధం ఎత్తివేస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయంపై ఆమె స్పందించారు. ‘మా’ స్పందనపై నేను 20 శాతం కూడా ఆనందంగా లేను. ఆఫర్స్ ఇస్తాం పడుగ చేస్కో.. అనడానికి వాళ్లు వేసే భిక్ష నాకు వద్దని న్యాయబద్దంగా తనకు రావాల్సిన వాటిని సాధించుకుంటానన్నారు శ్రీరెడ్డి. అది చేస్తాం.. ఇది చేస్తాం అని డబ్బా రేకుల సుబ్బారాయుడిలాగా చెప్పేస్తే మేం వినం.. తన డిమాండ్‌లు నెరవేరే వరకూ వెనక్కితగ్గే ప్రసక్తే లేదని చెప్పింది శ్రీరెడ్డి.

అంతకు ముందు మా మీడియా సమావేశం ఏర్పాటు చేసి శ్రీరెడ్డిపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఆమె చేసిన ఆరోపణలకు తాము మనస్తాపం చెందామని, అందుకే నిషేధం విధించామని, ఇకపై ఆమెతో కలిసి ఇతర నటులు నటించవచ్చని ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా పేర్కొన్నారు. ఆమెపై నిషేధాన్ని ఎత్తేయాలని కొందరు ఆర్టిస్టులు కోరడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అంతేగాక టాలీవుడ్ లో నటీమణులపై వేధింపులు అరికట్టడమే లక్ష్యంగా ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

అయితే దీనిపై శ్రీరెడ్డి అసంతృప్తి వెలిబుచ్చింది. తన డిమాండ్‌లపై మా నుండి సానుకూలమైన నిర్ణయం రాలేదన్నారు. వాళ్ల నిర్ణయాలపట్ల తాను సంతృప్తిగా లేనన్నారు శ్రీరెడ్డి. తెలుగు హీరోయిన్స్‌కి అవకాశాలు ఇవ్వాలని తమకోసం ప్రత్యేక కోటా ఉండాలనే డిమాండ్‌పై ‘మా’ స్పందించలేదన్నారు. కొత్తగా వాళ్లేమీ తమపై వరాల జల్లు కురిపించలేదని.. సినిమా పరిశ్రమ అనేది ఎవరో ఒకరికి సంబధించినది కాదు.. ఇది అందరిదీ, ఇందులో నటించే, పనిచేసే ప్రతి ఒక్కరికీ భాగస్వామ్యం ఉంటుందని చెప్పింది. మా లో సభ్యత్వం అనేది నా హక్కు. నా హక్కులను ఎలా సాధించుకోవాలో తనకు తెలుసన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here