రకుల్ ప్రీత్ సింగ్ మీద షాకింగ్ కామెంట్లు చేసిన శ్రీరెడ్డి..!

శ్రీ రెడ్డి.. సోషల్ మీడియా లోనూ, టీవీ ఛానల్స్ లోనూ ఈమె పేరు తెగ వినిపించింది ఇటీవలి కాలంలో..! తెలుగు అమ్మాయిలకు అన్యాయం జరుగుతోందని చెప్పుకొచ్చింది. తనను వాడుకున్న వాళ్ళందరి గుట్టు బయటపెడతానని హెచ్చరించింది కూడానూ.. ఇంతలో డైరెక్టర్ తేజ ఆమెకు తన రెండు సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని చెప్పారు. అయితే ఇప్పుడు శ్రీ రెడ్డి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మీద నోరు పారేసుకుంది.


‘అమ్మా! మీరు స్టార్ హీరోయిన్ అయిపోయారని, మీకు రాజభోగాలు జరుగుతున్నాయని, కోట్ల కొద్దీ డబ్బు ఉందని నచ్చినట్టు మాట్లాడకండి.. ఇక్కడ కడుపు మంటతో చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు’ అని చెప్పింది. వారికోసమే తాను మాట్లాడానని పేర్కొంది. తామంతా కడుపునిండా తినడం కోసం కష్టపడుతున్నామని చెప్పింది. తామేమీ పబ్లిసిటీ కోసం లేనిపోనివి మాట్లాడడం లేదని శ్రీరెడ్డి స్పష్టం చేసింది.

ఈ మాటలు అనడానికి కారణం ఇటీవల మీడియాలో తెలుగు సినిమా పరిశ్రమ గురించి చాలా తప్పుగా మాట్లాడారని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఓ సభ పెట్టి మాట్లాడింది. అందులో రకుల్ ప్రీత్ మాట్లాడుతూ తాను ఎక్కడి నుండో వచ్చి.. ఇక్కడ ఒంటరిగా ఉంటున్నానని.. తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టి ఇన్ని సంవత్సరాలు అయినా తనకు క్యాస్టింగ్ కౌచ్ లాంటి ఘటన ఒక్కటి కూడా ఎదురుకాలేదని చెప్పుకొచ్చింది. తెలుగు పరిశ్రమ చాలా మంచిదని చెప్పుకొచ్చింది. అయితే ఈ వ్యాఖ్యలతో ఏకీభవించని శ్రీ రెడ్డి రకుల్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here