కిడ్నీ కాజేసీ.. డ‌బ్బులు కూడా ఇవ్వ‌లేదు! పోలీస్‌స్టేష‌న్‌లో శ్రీ‌రెడ్డి!

టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతున్న వ‌ర్ధ‌మాన న‌టి శ్రీ‌రెడ్డి.. బంజారాహిల్స్ పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లారు. ఆరోప‌ణ‌ల మీద కాదు.. ఓ టీవీ న‌టి స‌హాయంగా. ప‌లు సీరియ‌ళ్ల‌లో న‌టించిన న‌టుడు బాలాజీ, జూనియ‌ర్ ఆర్టిస్ట్ ల‌క్ష్మిని తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నార‌ని ఆరోపిస్తూ ఆమె పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లారు. ల‌క్ష్మికి మ‌ద్ద‌తుగా నిలిచారు. బాలాజీపై ఫిర్యాదు చేశారు.

 

కిడ్నీ మార్పిడి వ్యవహారంలో టీవీ నటుడు బాలాజీ త‌న‌ను మోసం చేశాడ‌ని ల‌క్ష్మి ఆరోపించారు. బాలాజీ భార్య కృష్ణవేణికి రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో ఆపరేషన్ చేయాల్సి వ‌చ్చింది. యూసుఫ్‌గూడ సమీపంలోని యాదగిరి నగర్‌లో నివసించే జూనియర్‌ ఆర్టిస్ట్‌ భాగ్యలక్ష్మిని బాలాజీ సంప్రదించగా.. కిడ్నీ ఇవ్వడానికి ఆమె అంగీకరించారు.

గతేడాది జూన్‌లో భాగ్యలక్ష్మి త‌న‌ కిడ్నీని ఇచ్చారు. దీనికి ప్ర‌తిఫ‌లంగా 20 లక్షల రూపాయ‌లు ఇస్తానని చెప్పి … అడ్వాన్స్‌గా రూ.3 లక్షలు ఇచ్చారని, మిగిలిన డబ్బు కోసం అడిగితే… తిడుతూ ఫోన్‌ పెట్టేస్తున్నారని ల‌క్ష్మి చెప్పారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన బాలాజీ తన దగ్గర ఉన్న ఒప్పంద పత్రాలు, బ్యాంకు ఖాతా లావాదేవీల వివరాలను పోలీసులకు సమర్పించారు. భాగ్యలక్ష్మి నుంచి ఫిర్యాదు స్వీకరించామని, కేసు నమోదు చేస్తామ‌ని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here