హైపర్ ఆది నిన్ను చెప్పుతో కొడతానన్న శ్రీరెడ్డి.. నా చేతికి ఉన్న దురద మామూలుది కాదు..!

జబర్దస్త్ కార్యక్రమంలో తన గురించి ఛీప్ పంచ్ లు వేస్తున్నారని శ్రీరెడ్డి తన లైవ్ లో చెప్పుకొచ్చింది. ముఖ్యంగా హైపర్ ఆది చెప్పుతో కొడతానని శ్రీరెడ్డి వార్నింగ్ ఇచ్చింది. తాను చేస్తున్న పోరాటాన్ని పెయిడ్ ఆర్టిస్ట్ ల పోరాటంగా కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.

ఆడోళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వండి అని అడుగుతున్న సమయంలో ఆడపిల్లల మీద కామెంట్లు చేయడం ఏ మాత్రం బాగోలేదని శ్రీ రెడ్డి చెప్పుకొచ్చింది. ఆడపిల్లల విషయంలో పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే తాట మామూలుగా తీయను అని చెప్పింది. షర్ట్ విప్పరా ఇంటర్నేషనల్ మీడియాలో చూపిస్తారు అన్న పంచ్ గురించి ప్రస్తావించిన శ్రీరెడ్డి నిన్ను తిట్టడానికి నా దగ్గర మాటలు లేవని చెప్పుకొచ్చింది. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు.. అది తెలుసుకొని మాట్లాడు అని హితవు పలికింది. ఓ ఆడదాని గురించి మాట్లాడేముందు జాగ్రత్తగా ఉండు ఆది అంటూ వార్నింగ్ ఇచ్చింది శ్రీరెడ్డి. జబర్దస్త్ ను అడ్డం పెట్టుకొని పిచ్చి పిచ్చి జోక్ లు వేసే ఆదికి నా ఒక్క చెప్పు మాత్రమే కాదు వందల చెప్పు దెబ్బలు పడతాయి అని చెప్పింది శ్రీరెడ్డి. నా ముందు నువ్వు ఉండి ఉంటే నిన్ను బ్రతకనిచ్చేదాన్ని కాదని వార్నింగ్ ఇచ్చింది శ్రీ రెడ్డి.

Hyper adhi gari gurinchi

Sri Reddyさんの投稿 2018年5月27日(日)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here