అతిలోక సుంద‌రి అంతిమ‌యాత్ర మొద‌లు..

ముంబై: శ్రీ‌దేవి అంతిమ‌యాత్ర మొద‌లైంది. పవన్ హన్స్ శ్మశానవాటికలో మధ్యాహ్నం 3.30 నిమిషాలకు శ్రీదేవి పార్థివ దేహానికి అంత్యక్రియలు జరుగనున్నాయి.

అశేష అభిమానుల క‌డ‌సారి చూపు కోసం శ్రీ‌దేవి పార్థివ దేహాన్ని సెలబ్రేషన్‌ స్పోర్ట్స్‌ క‍్లబ్‌లో ఉంచారు. మ‌ధ్యాహ్నం 2:30 గంట‌ల‌కు ఆమె పార్థివ దేహాన్ని ప్ర‌త్యేక వాహ‌నంలో ఉంచి, శ్మ‌శాన వాటిక‌కు త‌ర‌లించారు.

ఈ సంద‌ర్భంగా శ్రీ‌దేవి పార్థివ దేహాన్ని పెళ్లి కుమార్తెలా ముస్తాబు చేశారు. అంత్య‌క్రియ‌ల‌ను మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం అధికార లాంఛ‌నాల‌తో నిర్వ‌హిస్తోంది. శ్రీ‌దేవి పార్ధివ దేహంపై జాతీయ జెండాను ఉంచి, నివాళి అర్పించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here