దుబాయ్ విడిచి వెళ్లొద్దంటూ బోనీక‌పూర్‌కు ఆదేశం..పాస్‌పోర్ట్ స్వాధీనం

ముంబై: బాత్‌ట‌బ్‌లో ప‌డితే ప్రాణం పోతుందా? శ్రీ‌దేవి చిన్న‌పిల్లేమీ కాదే. బాత్‌ట‌బ్బులూ ఆమెకు కొత్తేమీ కాదు. మ‌ద్యం తీసుకుని ఉందే అనుకుందాం..నీటిలో మునిగి ప్రాణాలు పోతున్నా, తెలియ‌నంత‌గా తాగిందా? ఇవే ఇప్పుడు త‌లెత్తుతున్న ప్ర‌శ్న‌లు.

దీనికితోడు- మ‌ద్యం సేవించే అల‌వాటు శ్రీ‌దేవికి లేదని ఆమె స‌న్నిహితులు చెబుతున్నారు. అమ‌ర్‌సింగ్ కూడా ఈ విషయాన్ని ధృవీక‌రిస్తున్నారు. త‌న వ‌దినకు ఎప్పుడూ గుండెపోటు రాలేద‌ని సాక్షాత్తూ బోనీక‌పూర్ సోద‌రుడు సంజ‌య్‌క‌పూర్ చెబుతున్నారు.

వీట‌న్నింటినీ గుది గుచ్చి చూస్తే.. శ్రీ‌దేవి మ‌ర‌ణం వెనుక ఏదో మిస్ట‌రీ దాగి ఉంద‌ని అర్థ‌మౌతోంది. శ్రీ‌దేవి మ‌ర‌ణం కేవ‌లం ప్ర‌మాద‌మేన‌ని, నీటిలో మునిగి మరణించిందని, గుండెపోటు కాద‌ని దుబాయ్ ఫోరెన్సిక్ నివేదిక స్ప‌ష్టం చేయ‌డం అనుమానాల‌ను బ‌ల‌ప‌రుస్తోంది.

ఈ అనుమానాల‌తోనే దుబాయ్ పోలీసులు శ్రీ‌దేవి భ‌ర్త బోనీక‌పూర్‌ను అదుపులోకి తీసుకుని, మూడు గంట‌ల పాటు విచారించారు. శ్రీ‌దేవి-బోనీక‌పూర్ కాల్‌డేటాను పరిశీలించారు. శ్రీ‌దేవి దుబాయ్‌లో ఉండ‌గానే.. బోనీక‌పూర్ ముంబైకి వెళ్లి.. మ‌ళ్లీ తిరిగి వ‌చ్చారు.

బోనీ వెంట ఆయ‌న కుమార్తె ఖుషీ కూడా ఉన్నార‌ని చెబుతున్నారు. శ్రీ‌దేవికి `స‌ర్‌ప్రైజ్ డిన్న‌ర్` ఇవ్వాల‌నే ఉద్దేశంతోనే బోనీ క‌పూర్ ముంబైకి వెళ్లిన‌ట్టే వెళ్లి మ‌ళ్లీ వెన‌క్కి వచ్చార‌ని ఖ‌లీజ్‌టైమ్స్ వెల్ల‌డించింది.

రాత్రి గంట‌ల స‌మ‌యంలో నిద్రపోతున్న శ్రీదేవిని లేపి.. డిన్న‌ర్‌కు వెళ్దామ‌ని బోనీక‌పూర్ చెప్పార‌ని, డిన్న‌ర్‌కు వెళ్ల‌డానికి సిద్ధం కావ‌డం కోసం శ్రీదేవి బాత్‌రూమ్‌కు వెళ్లార‌ని బోనీక‌పూర్ పోలీసుల ద‌ర్యాప్తులో వెల్ల‌డించిన‌ట్లు దుబాయ్ మీడియా చెబుతోంది.

సుమారు అర‌గంట గ‌డిచిన‌ప్ప‌టికీ శ్రీ‌దేవి తిరిగిరాలేదు. దీనితో బోనీక‌పూర్ హోట‌ల్ సిబ్బంది స‌హాయంతో మారు తాళం చెవితో బాత్‌రూమ్ త‌లుపు తెరిచి చూడ‌గా బాత్‌ట‌బ్‌లో శ్రీ‌దేవి అచేత‌నంగా ప‌డి ఉన్న స్థితిలో చూశారని ద‌ర్యాప్తులో తేలింది.

స్పందనలేని స్థితిలో ఉన్న శ్రీదేవిని చూశామ‌ని బోనీక‌పూర్ ద‌ర్యాప్తు సంద‌ర్భంగా వెల్ల‌డించిన‌ట్లు అక్క‌డి మీడియా చెబుతోంది. దీన్ని బ‌ట్టి చూస్తే.. మొద‌ట‌గా బోనీక‌పూర్‌నే అనుమానించాల్సి వ‌స్తోంద‌ని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కేసును ప‌బ్లిక్ ప్రాసిక్యూష‌న్‌కు బ‌దిలీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here