శ్రీదేవి గురించి విపరీతంగా రాశారు.. మరి సిరియా గురించి పట్టించుకోరా..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎలెక్ట్రానిక్ మీడియాకు.. నెటిజన్లకు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. శ్రీదేవి గురించి నిమిషం నిమిషానికి ఓ కొత్త వార్త రాస్తున్నారు.. అదే సిరియాలో వందల మంది చిన్నపిల్లలు చనిపోతున్నా పట్టించుకోరా వారిని అని ప్రతి ఒక్కరూ దుమ్మెత్తిపోస్తున్నారు.

శ్రీదేవి మృతి విషయంలో మన మీడియా చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదన్నది నెటిజన్ల అభిప్రాయం. శ్రీదేవి చనిపోయిందన్న విషయం గురించి బాగానే చెప్పారు.. కానీ ఆమె మృతిపై అనుమానాలు ఉన్నాయి అని చెప్పిన తర్వాత వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు. ఏకంగా ఆమె ఎలా మరణించిందో తెలుసుకోవాలంటూ జర్నలిస్టులను బాత్ టబ్ లో పడుకోబెట్టడం చాలా ఓవర్ యాక్షన్ అని అంటూ ఉన్నారు.

ఇక ప్రతి ఒక్క విషయాన్ని సెన్సేషనల్ చేసే మీడియా కూడా తమ వ్యూవర్స్ ను టీవీల ముందే కట్టిపడేయడానికి ఏది పడితే అది ప్రసారం చేసింది. అదే మీడియా ప్రముఖులను అడిగితే జనాలు చూస్తున్నారు కాబట్టే మేము కూడా రాస్తున్నాం అని.. చూపిస్తున్నాం అని సమాధానమిస్తారు.

ఇక నెటిజన్లు అయితే కన్ను కొట్టిన ‘ప్రియా వారియర్’ గురించి ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా అని వెతికారు. ప్రియా వారియర్ గురించి సెన్సేషనల్ అయిన సమయంలోనే సిరియాలో పెద్ద ఎత్తున బాంబు దాడులు జరిగాయి.. దాని గురించి మీడియాలో కూడా వచ్చింది. మన వాళ్ళు ప్రియా వారియర్ మాయలో పడి ఆ వార్తల గురించి కనీసం పట్టించుకోవడం కూడా మానేశారు. జనాలకు కూడా అవే కావాలని అనుకున్న మీడియా సంస్థలు ఆమె గురించి ప్రత్యేకంగా కథనాలు రాయడం చేశారు.

ప్రజలు చూడడం లేని వార్తలు ఎందుకు ప్రసారం చేయాలిలే అనుకున్నారో ఏమో.. పలు మీడియా సంస్థలు సిరియా గురించి రాయడం కూడా మానేశాయి. దీనిపైనే నెటిజన్లు గుర్రుగా ఉన్నారు. ఏది ఏమైనా కానీ ఇద్దరిదీ తప్పే.. కొత్త విషయం ఏదైనా దొరికితే చాలు టీవీ ఛానల్స్ కు అతుక్కుపోవడం జనాల పని అయిపోయింది.. ఇక వాళ్ళు చూస్తున్నారులే అని చూపించిందే.. చూపించి.. చెప్పిందే చెప్పి టీవీ ఛానల్స్ జర్నలిజాన్ని అపహాస్యం చేస్తున్నాయి. టీఆర్పీ కోసం జరుగుతున్న యుద్ధంలో మానవత్వం మరచి ప్రవర్తిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here