శ్రీదేవి గుండెపోటుతో చనిపోలేదు.. మద్యం తీసుకోవడంతో..!

శ్రీదేవి గుండెపోటుతో చనిపోయారని మీడియాలో చెబుతున్నారు. అయితే శ్రీదేవి ప్రమాదవశాత్తూ మృతి చెందారని యూఏఈ ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. ఆమె ప్రమాదవశాత్తు బాత్ రూమ్‌లో టబ్‌లో మునిగి చనిపోయినట్లు తమ వైద్యులు నిర్ధరించారని చెప్పారు. ఆ సమయంలో ఆమె మద్యం తీసుకున్నారని ఫోరెన్సిక్‌ నివేదికలో తేలిందని తెలిపారు. ఆమె గుండెపోటులో చనిపోయారని అందరూ భావించిన విషయం తెలిసిందే.

శ్రీదేవికి సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక దుబాయ్ పోలీసులకు అందింది. శ్రీదేవి మరణ ధ్రువీకరణ పత్రం కూడా జారీ చేశారు. శ్రీదేవి భౌతిక కాయాన్ని భారత్ కు తరలింపు ఏర్పాట్లకు సంబంధించిన ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here