ముంబై చేరుకున్న శ్రీదేవి భౌతికకాయం..!

దుబాయ్ లో మృతి చెందిన ప్రముఖ సినీ నటి శ్రీదేవి భౌతికకాయం భారత్ చేరుకుంది. ముంబైలోని ఛత్రపతి శివాజీ ఎయిర్ పోర్ట్ కు ఈరోజు రాత్రి 9.30 గంటల సమయంలో ఆమె భౌతిక కాయం చేరుకుంది. శ్రీదేవి భౌతికకాయం వెంట భర్త బోనీ కపూర్, కూతురు ఖుషీ కపూర్, సంజయ్ కపూర్, అర్జున్ కపూర్ ఉన్నారు. ముంబై ఎయిర్ పోర్ట్ వద్దకు నటుడు అనిల్ కపూర్, ప్రముఖ వ్యాపార దిగ్గజం అనిల్ అంబానీ, టీనా అంబాని ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ దగ్గర ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ఎయిర్ పోర్ట్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అభిమానుల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని ముంబైలోని సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్ లో రేపు ఉదయం 9.30 నుంచి 12.30 వరకు ఉంచుతారు. మధ్యాహ్నం 2 గంటలకు స్పోర్ట్స్ క్లబ్ నుంచి పవన్ హన్స్ వరకు అంతిమ యాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు విలే పార్లే హిందూ శ్మశాన వాటికలో శ్రీదేవి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆమె కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన విడుదల చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here