శ్రీ‌దేవి దుబాయ్‌కు వెళ్లింది ఈ జంట పెళ్లి కోస‌మే!

ముంబై: ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న జంట పేరు మోహిత్ మ‌ర్వా, అంతారా. వారిద్ద‌రికీ కొత్త‌గా పెళ్ల‌యింది. ఖ‌చ్చితంగా చెప్పాలంటే మూడురోజుల కింద‌టే దుబాయ్‌లో వారిద్దరూ ఒక్క‌ట‌య్యారు. వారి పెళ్లికి వెళ్లే.. అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి హ‌ఠాన్మ‌ర‌ణానికి గుర‌య్యారు.

దాదాపు మూడు రోజులు గడుస్తున్న‌ప్ప‌టికీ.. శ్రీ‌దేవి మ‌ర‌ణానికి గ‌ల కార‌ణం ఇదీ అంటూ తేల‌లేదు. పెళ్లి వేడుకలు ముగిసిన త‌రువాత మోహిత్ మ‌ర్వా, ఆయ‌న భార్య అంతారా ముంబైకి వ‌చ్చేశారు.

మంగ‌ళ‌వారం ముంబైలో న‌టుడు అనిల్ క‌పూర్ ఇంటికి వెళ్లారు. ఆ సంద‌ర్భంగా తీసిన ఫొటోలు ఇవి. ఈ పెళ్లికి వెళ్లిన శ్రీ‌దేవి, త‌న భ‌ర్త బోనీక‌పూర్‌, కుమార్తె ఖుషీతో క‌లిసి హోట‌ల్ జుమైరా ఎమిరేట్స్ రూమ్‌నంబ‌ర్ 2201లో దిగారు.

శ‌నివారం రాత్రి ఆమె అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించారు. త‌మ పెళ్లికి వ‌చ్చే శ్రీ‌దేవి అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించ‌డం..ఇంత కంటే విషాదం ఈ జంట‌కు మ‌రొక‌టి ఉండదేమో!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here