నడి రోడ్డుపై బట్టలు విప్పిన శ్రీరెడ్డి.. చెప్పిన పని చేసింది..!

శ్రీ రెడ్డి.. మొన్న ఒక టీవీ ఛానల్ లో చెప్పినట్లే చేసింది. హైదరాబాద్ లోని ఫిలింఛాంబర్ ఎదురుగా అర్ధ నగ్నంగా రోడ్డుపై బైటాయించింది. ఈ రోజు ఉదయం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ ముందుకు వచ్చిన శ్రీ రెడ్డి అర్ధ నగ్నంగా నిలబడింది. సిగ్గు విప్పి తాను ఎన్నో సార్లు చెప్పానని.. కానీ మా అసోసియేషన్ ఒప్పుకోకపోవడంతోనే తాను ఈ పని చేశానని చెప్పుకొచ్చింది.

ఒక్క సినిమా చేస్తే చాలా మందికి మా కార్డు ఇస్తున్నారని.. మూడు సినిమాలు చేసినా తనకు మా అసోసియేషన్ కార్డు ఇవ్వడం లేదని చెప్పారు. తెలుగు అమ్మాయిలకు చాలా అన్యాయం జరుగుతోందని చెప్పుకొచ్చింది. ఒక ఆడది బట్టలు ఊడదీసి రోడ్డు మీద కూర్చుంటే కూడా కనికరించరా అని అడిగింది శ్రీరెడ్డి. కొద్ది రోజుల క్రితం టీవీ ఛానల్ లో జరిగిన చర్చలో తనకు న్యాయం చేయకపోతే ఎంతకైనా తెగిస్తానని చెప్పుకొచ్చింది. తాను నడిరోడ్డుపై గుడ్డలు విప్పడానికి కూడా సిద్ధమని చెప్పింది. చెప్పిన పని ఈ రోజు చేసి చూపించింది శ్రీ రెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here