శ్రీ‌రెడ్డి వెంట‌ప‌డ్డ ప‌వ‌న్ అభిమానులు: పోలీసుల ర‌క్ష‌ణ‌లో!

హైద‌రాబాద్‌: కాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారంలో ప్ర‌ముఖ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరును లాగిన వ‌ర్ధ‌మాన న‌టి శ్రీ‌రెడ్డిపై ఆయ‌న అభిమానులు ప‌గ‌బ‌ట్టారు. జూబ్లీహిల్స్‌లోని ఓ టీవీ ఛానెల్‌లో చర్చావేదికలో పాల్గొన‌డానికి ఆమె వ‌చ్చింద‌నే విష‌యం తెలుసుకున్న వెంట‌నే ఆయ‌న‌ అభిమానులు పెద్ద సంఖ్య‌లో ఛానెల్ కార్యాల‌యానికి చేరుకున్నారు.

చ‌ర్చ ముగిసిన త‌రువాత బ‌య‌టికి వ‌చ్చిన ఆమెపై దాడి చేయ‌బోయారు. కొట్ట‌బోయారు. దీనితో ఆమె చాలాసేపు ఛానెల్ కార్యాల‌యంలోనే ఉండిపోవాల్సి వ‌చ్చింది. మంగ‌ళ‌వారం రాత్రి ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అనంత‌రం యాజ‌మాన్యం జూబ్లీహిల్స్ పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు.

రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో స‌మాచారం అందుకున్న వెంట‌నే ఛాన‌ల్ కార్యాల‌యానికి చేరుకున్న పోలీసులు శ్రీ‌రెడ్డికి ర‌క్ష‌ణ క‌ల్పించారు. ఆమెను కారులో ఇంటికి తీసుకెళ్లారు. ప‌లువురు ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు బైక్‌ల‌పై ఆమె కారును వెంబ‌డించారు. మొద‌ట ఆమెను జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

అక్క‌డ కాసేపు కూర్చోబెట్టారు. అభిమానులు వెళ్లిపోయార‌ని నిర్ధారించుకున్న త‌రువాత పోలీసులు త‌మ వాహ‌నంలోనే తర్వాత పోలీసు వాహనంలో విజ‌య‌న‌గ‌ర్ కాల‌నీలోని ఆమె ఇంటికి తీసుకెళ్లారు. ఈ సంఘటనలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని, ఆ త‌రువాత విడిచిపెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here